ఎంపీడీఓ లతో సమీక్ష సమావేశం నిర్వహించిన ముత్తుముల.


 ఎంపీడీఓ లతో సమీక్ష సమావేశం నిర్వహించిన ముత్తుముల.

ఉమ్మడి ప్రకాశం జిల్లా క్రైమ్ 9 మీడియా ప్రతినిధి దాసరి యోబు. 

మార్కాపురం గిద్దలూరు ఎమ్మెల్యే కార్యాలయంలో నియోజకవర్గంలోని ఆరు మండలాల ఎంపీడీఓ లతో గిద్దలూరు శాసనసభ్యులు ముత్తుముల అశోక్ రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా నియోజకవర్గంలో ఎక్కడా తాగునీటి సమస్య తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని శాసనసభ్యులు అధికారులకు సూచించారు. గ్రామాలు, పట్టణ ప్రాంతాల్లో తాగునీటి సరఫరాపై ప్రత్యేక దృష్టి సారించి, ప్రజలకు నిరంతరాయంగా స్వచ్ఛమైన తాగునీరు అందేలా అవసరమైన ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు.

అలాగే నీటి వనరుల స్థితిగతులు, బోర్‌వెల్‌లు, ఓవర్ హెడ్ ట్యాంకులు, పైప్‌లైన్‌ల నిర్వహణపై మండలాల వారీగా సమీక్ష నిర్వహించారు. ఎక్కడైనా నీటి కొరత ఏర్పడే అవకాశం ఉన్న ప్రాంతాలను ముందుగానే గుర్తించి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేపట్టాలని, అవసరమైతే ట్యాంకర్ల ద్వారా తాగునీరు సరఫరా చేసే విధంగా కార్యాచరణ సిద్ధం చేసి ప్రజలకు నీటిపై ఎటువంటి ఇబ్బందులున్నా వెంటనే పరిష్కారం చేయాలని సూచించారు.

ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు క్షేత్రస్థాయిలో నిరంతరం పర్యవేక్షణ చేపట్టి సమస్యలను వెంటనే పరిష్కరించాలని శాసనసభ్యులు ఆదేశించారు.

అలాగే గ్రామ సచివాలయలు సందర్శించి సిబ్బంది పనితీరు మెరుగుపడేలా చూడాలి అని ఎంపీడీఓ లకు శాసనసభ్యులు పలు సూచనలు చేశారు

ఈ సమావేశంలో 6 మండలాల ఎంపీడీఓ లు పాల్గొని మండలాల వారీగా తాగునీటి సరఫరా పరిస్థితులను శాసనసభ్యులకు వివరించారు. శాసనసభ్యులు అవసరమైన సూచనలు, మార్గదర్శకాలు గిద్దలూరు శాసనసభ్యులు అశోక్ రెడ్డి తెలియజేశారు.

Post a Comment

Please Select Embedded Mode To Show The Comment System.*

Previous Post Next Post