25న కంబం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో జాబ్ మేళా.
ఉమ్మడి ప్రకాశం జిల్లా క్రైమ్ 9మీడియా ప్రతినిధి దాసరి యోబు
మార్కాపురం జిల్లా కంబం ప్రభుత్వ జూనియర్ కళాశాల స్కిల్ హబ్‌లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ (APSSDC) ఆధ్వర్యంలో ఈ నెల 25వ తేదీన మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ ఏ సైమన్ విక్టర్ తెలిపారు.
ఈ జాబ్ మేళాలో 8 ప్రముఖ కంపెనీలు పాల్గొని సుమారు 700 ఉద్యోగ అవకాశాలను అందిస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. ఎంపికైన అభ్యర్థులకు నెలకు ₹15,000 నుండి ₹30,000 వరకు వేతనం లభించే అవకాశముందని తెలిపారు.
10వ తరగతి, ఐటీఐ, ఇంటర్మీడియట్, డిప్లొమా, డిగ్రీ మరియు ఇంజనీరింగ్ పూర్తి చేసిన నిరుద్యోగ యువతీ యువకులు ఈ జాబ్ మేళాకు హాజరై ఉద్యోగ అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.
జాబ్ మేళాకు సంబంధించిన మరిన్ని వివరాల కోసం 8019311043, 9912438757, 7013950097 నంబర్లను సంప్రదించవచ్చని తెలిపారు.
