పాఠశాల అభివృద్ధి ప్రణాళికలపై సమీక్షా సమావేశం.



 పాఠశాల అభివృద్ధి ప్రణాళికలపై సమీక్షా సమావేశం.

 ఉమ్మడి ప్రకాశం జిల్లా క్రైమ్ 9 మీడియా ప్రతినిధి దాసరి యోబు.

మార్కాపురం జిల్లా కంభం: పాఠశాలల సమగ్ర అభివృద్ధి, విద్యా ప్రమాణాల పెంపు, మౌలిక సదుపాయాల విస్తరణ లక్ష్యంగా బుధవారం స్థానిక మండల విద్యాశాఖ కార్యాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మండల విద్యాశాఖాధికారి పత్తి. శ్రీనివాసులు మాట్లాడుతూ పాఠశాలలు అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి ప్రణాళికలు రూపొందించాలని,

విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడంతో పాటు పాఠశాలల్లో తరగతి గదులు,త్రాగునీరు, మరుగుదొడ్లు, విద్యుత్ సౌకర్యాలు, డిజిటల్ విద్యా వనరులు తదితర మౌలిక సదుపాయాల కల్పనపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. విద్యార్థుల హాజరు శాతం పెంపు, అభ్యసన ఫలితాల అభివృద్ధి, పరిశుభ్రత నిర్వహణ, పచ్చదనం, పర్యావరణ పరిరక్షణ కార్యక్రమాలను ప్రణాళికల్లో చేర్చాలని చెప్పారు.

ప్రభుత్వం అమలు చేస్తున్న విద్యా సంస్కరణలు,మన బడి మన భవిష్యత్తు,విద్యా కార్యక్రమాల నిర్వహణ, పాఠశాల భద్రతా ప్రమాణాల అమలు తదితర అంశాలపై చర్చించారు. మండలంలోని అన్ని పాఠశాలలు ప్రాధాన్యత క్రమంలో అవసరాలను గుర్తించి, అందుకు తగిన ప్రతిపాదనలు సిద్ధం చేయాలన్నారు. 

ఈ కార్యక్రమానికి రిసోర్స్ పర్సన్ గా వ్యవహరించిన ఉపాద్యాయులు జి.ఎస్. మనోహర్ రెడ్డి, పాఠశాల, ఆవాస ప్రాంత, క్లస్టర్ మరియు మండల అభివృద్ధి ప్రణాళికల రూపకల్పనపై సమగ్ర వివరణ అందించి, ప్రధానోపాధ్యాయులకు అవగాహన కలిగించారు.

ఈ సమావేశంలో క్లస్టర్ ప్రధానోపాధ్యాయులు గని.వెంకటేశ్వర్లు , అన్ని పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, సీఆర్పీలు,విద్యాశాఖ సిబ్బంది పాల్గొన్నారు.

Post a Comment

Please Select Embedded Mode To Show The Comment System.*

Previous Post Next Post