మద్యం సేవించి వాహనాలు నడిపిన 31 మందికి జరిమానాలు, ఒకరికి జైలు శిక్ష.
ఉమ్మడి ప్రకాశం జిల్లా క్రైమ్ 9 మీడియా ప్రతినిధి దాసరియోబు.
మార్కాపురం జిల్లా ఇన్‌చార్జి ఎస్పీ హర్షవర్ధన్ రాజు, ఐపీఎస్ ఆదేశాల మేరకు కంభం సబ్ ఇన్స్పెక్టర్ ఎ. శివకృష్ణా రెడ్డి ఆధ్వర్యంలో మద్యం సేవించి వాహనాలు నడుపుతున్న వారిపై ప్రత్యేక డ్రైవ్ నిర్వహించారు.
ఈ క్రమంలో గత నాలుగు రోజులలో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో పట్టుబడిన 31 మందిని గిద్దలూరులోని స్పెషల్ జ్యుడీషియల్ సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ న్యాయమూర్తి సీహెచ్. రమేష్ ఎదుట హాజరుపరిచారు.
విచారణ అనంతరం 30 మందికి ఒక్కొక్కరికి రూ.10,000 చొప్పున జరిమానా విధించగా, మరో ఒక్కరికి రూ.10,000 జరిమానాతో పాటు 15 రోజుల జైలు శిక్ష విధించినట్లు పోలీసులు తెలిపారు.
మద్యం సేవించి వాహనాలు నడపడం వల్ల ప్రమాదాలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని, ప్రజలు ట్రాఫిక్ నిబంధనలు పాటించి సురక్షితంగా ప్రయాణించాలని పోలీసులు సూచించారు. అలాగే డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిరంతరం కొనసాగుతాయని సబ్ ఇన్స్పెక్టర్ శివ కృష్ణారెడ్డి హెచ్చరించారు.
