యు.ఎఫ్.యస్ సర్వే షెడ్యూల్ పోస్టర్ను ఆవిష్కరించిన జిల్లా కలెక్టర్ విజయ సునీత.
ఉమ్మడి ప్రకాశం జిల్లా క్రైమ్ 9 మీడియా ప్రతినిధి దాసరియోబు.
ఈకార్యక్రమంలో మార్కాపురం జిల్లా స్వర్ణ గ్రామం స్వర్ణ వార్డు జిల్లా అధికారి శ్రీ బి.బాలు నాయక్ ,కంభం ఎంపీడీవో టి వీరభద్రాచారి, కంభం స్వర్ణ వార్డు స్వర్ణ గ్రామం డిప్యూటీ ఎంపీడీవో దేవరశెట్టి బ్రహ్మయ్య, ఉప మండల స్వర్ణ గ్రామ అధికారులు, డి.యస్.జి.ఓ స్వర్ణ గ్రామ సిబ్బంది పాల్గొనటం జరిగింది.
ముఖ్య గమనిక: UFS డేటా గ్రామ సభకు ఆహ్వానం
గ్రామ ప్రజలందరికీ నమస్కారం,
మన స్వర్ణ గ్రామ స్వర్ణ వార్డుపరిధిలో UFS డేటా సామాజిక తనిఖీ (సోషల్ ఆడిట్) మరియు ధృవీకరణ కోసం ప్రత్యేక గ్రామ సభ నిర్వహించబడుతోంది. ప్రభుత్వ సేవల పారదర్శకత కోసం ఈ ధృవీకరణ ప్రక్రియ అత్యంత కీలకమైనది.ముఖ్యమైన తేదీలు మరియు మీరు చేయాల్సినవి
డేటా ప్రదర్శన (18-06-2026):రేపటి నుండి UFS డేటా జాబితాను మన స్వర్ణ గ్రామ స్వర్ణ వార్డు కార్యాలయంలో ప్రదర్శించడం జరుగుతుంది. దయచేసి అక్కడికి వెళ్లి మీ కుటుంబ వివరాలను సరిచూసుకోవలన్నారు గ్రామ సభ (19-06-2026):ఎల్లుండి అన్ని ప్రాంతాల్లో గ్రామ సభలు నిర్వహించబడతాయి. ప్రజలందరూ విధిగా హాజరు కావాలి.ఫిర్యాదుల నమోదు (19-06-2026 నుండి 24-06-2026 వరకు) మీ డేటాలో కులం, పేరు లేదా ఇతర వివరాలకు సంబంధించి ఏవైనా తప్పులు ఉన్నట్లయితే, సభలో తెలియజేయవచ్చు లేదా సంబంధిత సిబ్బంది (DA/WDPS) వద్ద సరైన ఆధారాలతో ఫిర్యాదు (Complaint) నమోదు చేసుకోవచ్చు. ఆ తప్పులను విచారించి వెంటనే పరిష్కరించడం జరుగుతుంది.
మీ వివరాలు సరిగ్గా ఉంటేనే భవిష్యత్తులో ప్రభుత్వ సేవలు మరింత సులభంగా అందుతాయి. కావున ప్రతి ఒక్కరూ బాధ్యతగా ఈ గ్రామ సభలో పాల్గొని, మీ వివరాలను నిర్ధారించుకోవాల్సిందిగా కోరారు.
