ఇద్దరిని అరెస్టు చేసిన అటవీ శాఖ అధికారులు.


 ఇద్దరిని అరెస్టు చేసిన అటవీ శాఖ అధికారులు.

 ఉమ్మడి ప్రకాశం జిల్లా క్రైమ్ 9మీడియా ప్రతినిధి దాసరి యోబు.

మార్కాపురం జిల్లా గిద్దలూరు డివిజన్ లో ముళ్లపందిని నాటు తుపాకితో వేటాడిన ఇద్దరికి 14 రోజుల రిమాండ్

గుండ్లకమ్మ రేంజ్ పరిధిలోని అంబవరం బీట్ ప్రాంతంలో నాటు తుపాకితో ముళ్లపందిని అక్రమంగా వేటాడి చంపిన ఇద్దరు నిందితులను అటవీ శాఖ అధికారులు అరెస్టు చేశారు

అరెస్టు చేసిన నిందితులు గిద్దలూరు మండలం దిగువమెట్ట గ్రామానికి చెందిన మండ్లా శ్రీనివాసులు, గుర్రం పెద్ద గురవయ్యగా గుర్తించారు. 

అనంతరం వీరిని గిద్దలూరు అదనపు జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ కోర్టు ఎదుట హాజరుపరచగా, న్యాయమూర్తి 14 రోజుల రిమాండ్ విధించారు.

Post a Comment

Please Select Embedded Mode To Show The Comment System.*

Previous Post Next Post