ప్రజల సంతృప్తి మేరకు పనిచేయడమే అధికారు లక్ష్యం - కలెక్టర్.


 ప్రజల సంతృప్తి మేరకు పనిచేయడమే అధికారు లక్ష్యం -  కలెక్టర్. 

ఉమ్మడి ప్రకాశం జిల్లా క్రైమ్ 9 మీడియా ప్రతినిధి దాసరి యోబు.

ఒంగోలు,రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలులో ప్రజల సంతృప్తి మేరకు పని చేయడమే అధికారుల లక్ష్యమని జిల్లా కలెక్టర్ పి. రాజాబాబు అన్నారు.

శుక్రవారం జిల్లా కలెక్టర్ పి.రాజాబాబు, టెలి కాన్ఫెరెన్స్ నిర్వహించి సానుకూల ప్రజాభిప్రాయం (ఐ.వి.ఆర్.ఎస్ కాల్స్ పై), ప్రజా సమస్యల పరిష్కార కార్యక్రమంలో వచ్చిన దరఖాస్తుల పరిష్కార పురోగతి, జిల్లా లో చేపడుతున్న జనగణన ప్రక్రియ పురోగతి, రీ సర్వే, స్కూల్ ఎన్రోల్మెంట్, పి ఎం.కుసుం, పిఎం సుర్యఘర్, పెన్షన్స్ పంపిణీ, హౌసింగ్ ప్రోగ్రాం, జల ధార- జల హారతి తదితర అంశాలపై సంబంధిత అధికారులతో సమీక్షించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ,

రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలులో ప్రజల సంతృప్తి మేరకు అధికారులు పనిచేయాల్సి ఉందని స్పష్టం చేసారు. ఐ.వీ.ఆర్.ఎస్ సర్వే లో సైతం కొంత వెనుకబాటు కనబడు తుందని దాన్ని సరి చేసుకోవాలన్నారు.

ఐవిఆర్ఎస్ కాల్స్ పై ప్రజల్లో పూర్తిస్థాయి అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించారు. ప్రజా సమస్యల పరిష్కార కార్యక్రమంలో వచ్చిన ప్రతి వినతిని నిర్దిష్ట గడువులోగా పరిష్కరించేలా అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. ప్రజా సమస్యల పరిష్కారంలో ఎటువంటి నిర్లక్ష్యానికి తావులేదని కలెక్టర్ స్పష్టం చేశారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, అధికారులు బాధ్యతాయుతంగా వ్యవహరించి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని సూచించారు. జిల్లాలో స్పెషల్ ఎన్రోల్మెంట్ డ్రైవ్ చేపట్టి బడి ఈడు పిల్లలు బడిలో ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లా లో చేపట్టిన జనగణన ప్రక్రియను ఎలాంటి పోరాపాట్లుకు తావివ్వకుండా పటిష్టంగా చేపట్టాలని జిల్లా కలెక్టర్, సెన్సస్ అధికారులను ఆదేశించారు. జనగణనలో ప్రతి ఒక్కరి వివరాలు కచ్చితంగా ఉండేలా చూడాలని అధికారులను ఆదేశించారు. వర్షం ద్వారా కురిసే ప్రతి నీటి చుక్కను సంరక్షించుకోవడం జలధార – జలహారతి కార్యక్రమం ముఖ్య ఉద్దేశ్యమని, ఈ కార్యక్రమం కింద చేపట్టే పనులు నాణ్యతా ప్రమాణాలు పాటించి పనులు వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ అధికారులను ఆదేశించారు.

పియం సూర్య ఘర్ పధకంపై ప్రజలకు విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు చేపట్టి నిర్దేశించిన లక్ష్యాలను సాధించేలా చర్యలు తీసుకోవాలన్నారు.

Post a Comment

Please Select Embedded Mode To Show The Comment System.*

Previous Post Next Post