గత వైసీపీ ప్రభుత్వంలో దళిత ఎస్సీలపై జరిగిన దాడుల పై టిడిపి నాయకుల మీడియా సమావేశం.
ఉమ్మడి ప్రకాశం జిల్లా క్రైమ్ 9 మీడియా ప్రతినిధి దాసరియోబు.
మార్కాపురం జిల్లా కంభం పట్టణంలోని టిడిపి కార్యాలయంలో బుధవారం “గత వైసీపీ ప్రభుత్వం లో ఎస్సీలపై జరిగిన ఘోరాలు” అనే కార్యక్రమాన్ని నిర్వహించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు రాష్ట్రవ్యాప్తంగా ఈ సమావేశాలు నిర్వహిస్తున్నట్లు నాయకులు తెలిపారు.
ఈ సందర్భంగా గిద్దలూరు శాసనసభ్యులు ముత్తుమూల అశోక్ రెడ్డి ఆదేశాల మేరకు కంభం మండల టిడిపి అధ్యక్షులు తోట శ్రీనివాసులు రావు ఆధ్వర్యంలో, రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఎస్సీ సెల్ ప్రధాన కార్యదర్శి గోన చెన్నకేశవులు నేతృత్వంలో మీడియా సమావేశం నిర్వహించారు.
మీడియా సమావేశంలో గోన చెన్నకేశవులు మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వం హయాంలో దళితులపై అనేక అన్యాయాలు, దాడులు, అవమానకర ఘటనలు చోటుచేసుకున్నాయని ఆరోపించారు.
ఎస్సీల సంక్షేమాన్ని విస్మరించి, వారి హక్కులను కాలరాసే విధంగా గత ప్రభుత్వం వ్యవహరించిందని విమర్శించారు.
ప్రస్తుతం రాష్ట్రంలో టిడిపి ప్రభుత్వం సామాజిక న్యాయం లక్ష్యంగా పని చేస్తోందని, దళితుల అభ్యున్నతికి ప్రత్యేక చర్యలు చేపడుతోందని ఆయన తెలిపారు. దళితుల సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు.
ఈ కార్యక్రమంలో టిడిపి , ఎస్సీ సెల్ నాయకులు సిరివెళ్ల రవికుమార్. భాస్కర్. బుజ్జి ఎస్సీ సెల్ సభ్యులు, మండల స్థాయి కోటయ్య కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

