రూ.39.60 లక్షలతో జల జీవన్ మిషన్ ద్వారా ఇంటింటికి మంచినీరు పంపిణీ పథకం ప్రారంభించిన ఎమ్మెల్యే శ్రీమతి గౌతు శిరీష.



  రూ.39.60 లక్షలతో జల జీవన్ మిషన్ ద్వారా ఇంటింటికి మంచినీరు పంపిణీ పథకం ప్రారంభించిన  ఎమ్మెల్యే శ్రీమతి గౌతు శిరీష.

క్రైమ్9 మీడియా ప్రతినిధి శ్రీకాకుళం జిల్లా స్టాఫ్ రిపోర్టర్ శంకర్ తమ్మినేని.

శ్రీకాకుళం జిల్లా, వజ్రపుకొత్తూరు మండలం, పూండి గోవిందపురం పంచాయతీ పరిధిలోని మెట్టపేట గ్రామంలో జల జీవన్ మిషన్ కింద మంజూరైన రూ.39 లక్షల 60 వేల నిధులతో మంచినీటి పథకం పంపిణీ పలాస శాసనసభ్యులు, శ్రీమతి గౌతు శిరీష నేడు ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ, ప్రతి ఇంటికీ సురక్షితమైన మంచినీటిని అందించాలన్న గౌరవ ముఖ్యమంత్రి గారి లక్ష్యంలో భాగంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా జల జీవన్ మిషన్‌ను అమలు చేస్తున్నాయని తెలిపారు. మెట్టపేట గ్రామంలో ఈ పథకం ద్వారా ఇంటింటికీ నల్లా కనెక్షన్లు ఏర్పాటు చేసి, 24 గంటలు త్రాగునీరు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు.

గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు కూటమి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని, నియోజకవర్గంలోని ప్రతి గ్రామాన్ని అభివృద్ధి పథంలో నడిపించడమే తన ధ్యేయమని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. ఈ పనులను నాణ్యతతో, నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని అధికారులను, కాంట్రాక్టర్లను ఆదేశించారు.

ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, కూటమి నాయకులు, కార్యకర్తలు మరియు గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Post a Comment

Please Select Embedded Mode To Show The Comment System.*

Previous Post Next Post