రూ.27 లక్షలతో సీసీ రోడ్ల నిర్మాణ పనులు ప్రారంభించిన ఎమ్మెల్యే శ్రీమతి గౌతు శిరీష.
క్రైమ్ 9మీడియా ప్రతినిధి శ్రీకాకుళం జిల్లా స్టాఫ్ రిపోర్టర్ శంకర్ తమ్మినేని.
శ్రీకాకుళం జిల్లా, మందస మండలం, ములిపాడు గ్రామంలో మొత్తం రూ.27 లక్షల వ్యయంతో రెండు సీసీ రోడ్ల నిర్మాణ పనులకు పలాస శాసనసభ్యులు, శ్రీమతి గౌతు శిరీష గారు నేడు ప్రారంభించారు.
ఇందులో భాగంగా గ్రామంలోని తెలుకుల వీధి నుండి ముక్తేశ్వర ఆలయం వరకు రూ.19,50,000/- వ్యయంతో, అలాగే ఎస్సీ కాలనీ నుండి రాళ్ళరేవు వరకు రూ.7,50,000/- వ్యయంతో సీసీ రోడ్లు నిర్మించనున్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ, గ్రామీణ ప్రాంతాల్లో రవాణా సౌకర్యాలు మెరుగుపరిచి ప్రజలకు ఇబ్బందులు లేకుండా చేయడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో మౌలిక వసతుల కల్పనకు పెద్దపీట వేస్తున్నామని, దశలవారీగా అన్ని సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో టీడీపీ మండల నాయకులు, గ్రామ స్థాయి నాయకులు, కార్యకర్తలు మరియు గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

