టాపర్ గా నిలచిన వి.వి.ఎస్ జెడ్పి బాలికల ఉన్నత పాఠశాల బాలికలు.


 టాపర్ గా నిలచిన వి.వి.ఎస్ జెడ్పి బాలికల ఉన్నత పాఠశాల బాలికలు.

ఉమ్మడి ప్రకాశం జిల్లా క్రైమ్ 9 మీడియా ప్రతినిధి దాసరి యోబు.

బాలికల తల్లిదండ్రులను సన్మానించిన ఉపాధ్యాయులు 

మార్కాపురం జిల్లా కంభం ఇవాళ విడుదలైన ఏపీ టెన్త్ ఫలితాల్లో 

వి.వి.ఎస్ బాలికల ఉన్నత పాఠశాలకు( గర్ల్స్) చెందిన ఓ విద్యార్థిని సంచలనం సృష్టించారు. షేక్. రజియా సుల్తానా 600కుగాను ఏకంగా 582 మార్కులతో స్కూల్ టాపర్ గా నిలిచారు.

 రెండవ స్థానంలో పఠాన్. హ్యాపీస తస్లీమ్ 600కు గాను 575లు మూడో స్థానం లో సిహెచ్. వైష్ణవి 600కు గాను 557 మార్కులతో సత్తా చాటారు. గతేడాది వి.వి.ఎస్ బాలికల ఉన్నత పాఠశాలకు చెందిన కే. కవిత 600/581 మార్కులు రాగా ఈ ఏడాది చరిత్ర సృష్టించిన విషయం తెలిసిందే. వివిఎస్ బాలికల ఉన్నత పాఠశాల బాలికలు 72 మంది విద్యార్థులు పరీక్షకు హాజరవగా అందులో 68 మంది విద్యార్థులు ఉత్తీర్ణులు అయ్యారని ప్రధానోపాధ్యాయురాలు బి. అమూల్య తెలిపారు. 

అలాగే స్కూల్ టాపర్ గా నిలిచిన షేక్ రజియా సుల్తానా వారి తల్లిదండ్రులను ఎంఈఓ అబ్దుల్ సత్తార్, ప్రధానోపాధ్యాయురాలు బి. అమూల్య ఆధ్వర్యంలో పాఠశాల ఉపాధ్యాయులు సన్మానం చేయడం జరిగింది.

Post a Comment

Please Select Embedded Mode To Show The Comment System.*

Previous Post Next Post