టిడ్కో ఇళ్ల లబ్ధిదారులకు త్వరలోనే నిధులు విడుదల: ఎమ్మెల్యే గౌతు శిరీష.


 టిడ్కో ఇళ్ల లబ్ధిదారులకు త్వరలోనే నిధులు విడుదల: ఎమ్మెల్యే గౌతు శిరీష.

క్రైమ్ 9 మీడియా ప్రతినిధి శ్రీకాకుళం జిల్లా స్టాఫ్ రిపోర్టర్ 

పలాస నియోజకవర్గ పరిధిలోని టిడ్కో ఇళ్ల లబ్ధిదారులకు వారి వాటా మొత్తాన్ని త్వరలోనే అందిస్తామని పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష హామీ ఇచ్చారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే గౌతు శిరీష మాట్లాడుతూ, “గత ప్రభుత్వం పేదలకు ఇళ్లు ఇవ్వడం కంటే రంగులు వేయడానికే ప్రాధాన్యత ఇచ్చింది. పేదవాడి సొంతింటి కల నెరవేర్చాలనే ఆలోచన వారికి లేదు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత టిడ్కో ఇళ్ల నిర్మాణం వేగవంతం చేసి, లబ్ధిదారులకు న్యాయం చేసే దిశగా చర్యలు తీసుకుంటున్నాం. లబ్ధిదారులు ఎవరూ ఆందోళన చెందవద్దు. మీ అమౌంట్ త్వరలోనే మీ చేతికి అందుతుంది” అని స్పష్టం చేశారు.

కూటమి ప్రభుత్వం ఇప్పటికే అధికారులకు ఆదేశాలు జారీ చేసిందని, బకాయిలు క్లియర్ చేసే ప్రక్రియ కొనసాగుతోందని తెలిపారు. పేదల సంక్షేమమే తమ కూటమి ప్రభుత్వ ధ్యేయమని, ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తామని ఎమ్మెల్యే తెలిపారు. ఈ కార్యక్రమం లో మున్సిపల్ కమీషనర్ మరియు సిబ్బంది పాల్గున్నారు

Post a Comment

Please Select Embedded Mode To Show The Comment System.*

Previous Post Next Post