అల్లుఖొల వద్ద ఆటో బోల్తా.
ఏడుగురికి గాయాలు నలుగురు పరిస్థితి విషమం.
క్రైమ్ 9 మీడియా ప్రతినిధి శ్రీకాకుళం జిల్లా స్టాఫ్ రిపోర్టర్ శంకర్ తమ్మినేని.
పలాస.. శ్రీకాకుళం జిల్లా పలాస మండలం అల్లుఖోల సమీపంలో భయానక రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.
మెలియాపుట్టి మండలం గొప్పిలి నుంచి పలాస వైపు ప్రయాణికులతో వెళ్తున్న ఆటో… హరిసాగరం వద్ద రోడ్డులో అదుపుతప్పి చెరువులోకి దూసుకెళ్లి బోల్తా పడింది.
ఈ ప్రమాదంలో ఏడుగురు గాయపడగా… అందులో నలుగురి పరిస్థితి విషమంగా ఉంది.
గాయపడిన వారిని వెంటనే 108లో పలాస ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
వీరిలో నలుగురి పరిస్థితి విషమించడంతో ప్రాథమిక చికిత్స అనంతరం టెక్కలి జిల్లా ఆస్పత్రికి రిఫర్ చేసినట్లు వైద్యులు తెలిపారు.
ప్రమాద సమయంలో ఆటోలో తొమ్మిది మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం.
ఘటనపై కేసు నమోదు చేసిన కాశీబుగ్గ పోలీసులు దర్యాప్తు చేపట్టారు
.jpg)

