ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్ కు అంబేద్కర్ పేరు పెట్టాలి.



 ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్ కు అంబేద్కర్ పేరు పెట్టాలి.

- రాజకీయాల్లో తగినంత ప్రాధాన్యత ఇవ్వాలి.

- ఎస్సీ, ఎస్టీలపై దాడులను అరికట్టాలి.

- దళితవాడల్లో స్మశానవాటికలు ఏర్పాటు చేయాలి.

- దళిత ఆదివాసి జేఏసీ నాయకుల డిమాండ్.

క్రైమ్9మీడియా ప్రతినిధి శ్రీకాకుళం స్టాప్ రిపోర్టర్ టి శంకర్ రాజ్.

శ్రీకాకుళం ఏప్రిల్:28. శ్రీకాకుళంలో నూతనంగా నిర్మించిన ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్ కు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ పేరును నామకరణం చేయాలని దళిత ఆదివాసి జేఏసీ నాయకులు డిమాండ్ చేశారు. 

ఎన్నో ఏళ్లుగా వెనుకబడి తనానికి గురవుతున్న ఎస్సీ ఎస్టీలకు రాజ్యాధికారం సాధించే దిశగా అవకాశాలు పెరగాలని దళిత ఆదివాసి ఉద్యోగ ఉపాధ్యాయ ప్రజాసంఘాల ఐక్యవేదిక గౌరవ అధ్యక్షులు పూతల దుర్గారావు అన్నారు. నగరంలోని ఇలిసిపురం జంక్షన్ లో ఉన్న అంబేద్కర్ విజ్ఞాన మందిరంలో మంగళవారం దళిత ఆదివాసి జేఏసీ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి జేఏసీ అధ్యక్షులు డాక్టర్ గంజి ఆర్ ఎజ్రా అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా పోతల దుర్గారావు మాట్లాడుతూ దళితులకు చట్టసభల్లో అవకాశాలు పెరగాలని కోరారు. ఆదివాసి దళితులకు విద్య, ఉద్యోగ, సామాజిక, ఆర్థిక రంగాల్లో మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని డిమాండ్ చేశారు. జిల్లాలోని జిల్లా పరిషత్, కార్పొరేషన్ చైర్మన్లుగా దళిత ఆదివాసీలకు అవకాశాలు కల్పించే దిశగా చర్యలు తీసుకోవాలని కోరారు. జిల్లాలోని అనేక ప్రాంతాల్లో ఉన్న ఎస్సీ ఎస్టీ గ్రామాలకు ఇప్పటికీ స్మశానవాటికలు లేదని, తక్షణమే స్మశాన వాటిక ఏర్పాటుతో పాటు రహదారి సౌకర్యాలు కల్పించాలన్నారు. యువతకు ఉపాధి అవకాశాలు, నిరుద్యోగ భృతి కల్పించాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా పలు కార్పొరేషన్ల ద్వారా రుణాలను మంజూరు చేసి తక్షణమే దళిత ఆదివాసి యువత ఆర్థిక సోలం మనకు చేయూతనివ్వాలన్నారు. ప్రస్తుతం గురుకులాల్లో ఇంటర్మీడియట్ విద్య వరకు అవకాశం ఉందని వారిని డిగ్రీ , ఉన్నత విద్యకు కూడా అవకాశాలు కల్పించేలా చర్యలు చేపట్టాలని ప్రభుత్వాన్ని కోరారు. ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్కు అంబేద్కర్ పేరు పెట్టాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. అలాగే ఎన్నో ఏళ్లుగా పెండింగ్ లో ఉన్న ఎస్సీ ఎస్టీ బ్లాక్ లాగ్ పోస్టులను తక్షణమే భర్తీ చేయాలని కోరారు. త్వరలోనే జిల్లా వ్యాప్తంగా ఉన్న దళిత కుటుంబాల ప్రతి ఇంటికి వెళ్లి అంబేద్కర్ చిత్రపటాలను పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. జేషిని పూర్తిస్థాయిలో బలోపేతం చేసే దిశగా దళిత, గిరిజనుల సమస్యలపై విస్తృతమైన చర్చ నిర్వహించేందుకు త్వరలోనే ప్రణాళిక సిద్ధం చేస్తున్నామని ఈ సందర్భంగా ప్రకటించారు. ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో దళిత ఆదివాసి జేఏసీ నాయకులు కన్వీనర్ దండాసి రాంబాబు, కో కన్వీనర్ రమేష్ బాబు, గౌరవ సలహాదారు లింగాల అప్పన్న, సమన్వయకర్తలు అర్జీ కోటి, కింజరాపు నూకరాజు, అంపోలు ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. 

నూతన కార్యవర్గం ఇదే 

దళిత ఆదివాసి ఉద్యోగ ఉపాధ్యాయ ప్రజాసంఘాల జేఏసీ అధ్యక్షులు గంజి ఎజ్రా, గౌరవాధ్యక్షులు పోతల దుర్గారావు, సహాధ్యక్షులు భూపతి రవికుమార్, బసవల చిన్నారావు, దూళి మోహన్ రావు, ఉపాధ్యక్షులు నేతల ఆదినారాయణ, కన్వీనర్ దండాసి రాంబాబు, కో కన్వీనర్ సీర రమేష్ బాబు, గౌరవ సలహాదారులు నూతలపాటి భరత్ భూషణ్ రాజ్, కొప్పల డేవిడ్, లింగాల అప్పన్న, సమన్వయకర్తలు అంపోలు ప్రతాప్, అర్జీ కోటి, లింగాల నూకరాజు, ట్రెజరర్స్ ఆవల అప్పన్న, బొంతరాజు, న్యాయ సలహాదారులు కొండాల జీవరత్నం, జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీలు చల్లా రామారావు దువాన అప్పలసూరి, మీడియా కన్వీనర్స్ పడాల ప్రతాప్ కుమార్, కార్యదర్శిలు నిడగంట్ల సూర్యారావు, పాండ్రంకి తారక్, బెవర వెంకట శివ కుమార్, బొత్స శశిభూషణరావు, ధర్మాన గణేష్ తో పాటు పలువురిని ఎన్నుకున్నారు.

Post a Comment

Please Select Embedded Mode To Show The Comment System.*

Previous Post Next Post