కూటమి ప్రభుత్వ వైఫల్యంతోనే ఇంధన వనరులు కొరత -బమ్మిడి దుర్యోధనరావు.
క్రైమ్ 9మీడియా ప్రతినిధి శ్రీకాకుళం జిల్లా స్టాఫ్ రిపోర్టర్ టి శంకర్ రాజ్.
నాడు వంట గ్యాస్.. నేడు పెట్రోల్, డీజల్ కొరత వల్ల ప్రజలకు ఇబ్బందులు రాష్ట్రంలో గత నాలుగు రోజులుగా పెట్రోల్, డీజిల్ వంటి ఇంధన వనరులు దొరక్క బంకులు వద్ద ప్రజలు క్యూ కడుతున్నారని, సరుకుల రవాణా నిలిచిపోయిందని, 45 ఏళ్లు ఇండస్ట్రీ అని చెప్పుకునే సీఎం చంద్రబాబు మాత్రం ఈ సంక్షోభం వచ్చినప్పుడు స్పందించకపోవడం విడ్డూరంగా ఉందని వైఎస్ఆర్సిపి జిల్లా అధికార ప్రతినిధి బమ్మిడి దుర్యోధనరావు ఆందోళన వ్యక్తం చేశారు. సోమవారం ఆయన ఒక ప్రకటనలో తెలియజేస్తూ.., మన రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్ కొరత ప్రజలకు తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తుందన్నారు. ఈ పరిస్థితికి పూర్తిగా చంద్రబాబు ప్రభుత్వ నిర్లక్ష్యం, వైఫల్యం, అనాలోచిత విధానాలే కారణమన్నారు. ఇంధన సరఫరా వ్యవస్థను సక్రమంగా నిర్వహించడంలో కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. ప్రభుత్వ అసమర్థత కారణంగా సాధారణ ప్రజలు, ఉద్యోగులు, రైతులు, రవాణా రంగానికి చెందినవారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్ కొరతతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటుంటే, నారా లోకేష్ కనిపించడం లేదన్నారు. ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు ఆరోగ్యం బాగో లేకపోవడంతో, ఆయన విశ్రాంతి తీసుకుంటున్నారని, చంద్రబాబు చేతులు ఎత్తేసారని ఆయన ఎద్దేవా చేశారు. చంద్రబాబు తక్షణం మేల్కొని సొరకాయ కోతలు మాటలు ఆపి నరేంద్ర మోడీతో మాట్లాడి రాష్ట్రంలో ఉన్న పెట్రోల్, డీజిల్ ఇబ్బందుల నుంచి ప్రజలను గట్టెక్కించాలని ఆయన డిమాండ్ చేశారు. గత వైఎస్ఆర్సిపి ప్రభుత్వం లో ఇలాంటి పరిస్థితులు ఎప్పుడూ రాలేదని, అప్పట్లో ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకొని వ్యవస్థలను సమర్థవంతంగా నిర్వహించడం జరిగిందన్నారు. ప్రపంచాన్ని గడగడ లాడించిన కరోనా మహమ్మారి సమయంలో కూడా వైయస్ జగన్ ధైర్యంగా, సమర్థవంతంగా పరిస్థితిని ఎదుర్కొన్నారని ఆయన గుర్తు చేశారు. ఇప్పటికైనా చంద్రబాబు ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకొని పెట్రోల్, డీజిల్ సరఫరాను సాధారణ స్థితికి తీసుకురావాలని, ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూడాలని బమ్మిడి దుర్యోధనరావు వైస్సార్సీపీ జిల్లా అధికార ప్రతినిధి.
