రోకలి బండతో కొట్టి భార్యను హతమార్చిన భర్త.
ఉమ్మడి ప్రకాశం జిల్లా క్రైమ్ 9 మీడియా ప్రతినిధి దాసరి యోబు.
మార్కాపురం జిల్లా గిద్దలూరు మండలం గిద్దలూరు పట్టణం ఏబీఎం పాలెంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. భార్య దాసరి ప్రేమ కుమారి(36) ని భర్త దాసరి గంగయ్య(గంగరాజు) రోకలి బండతో కొట్టి దారుణంగా హత్య చేసిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. దారుణ హత్యకు గురైన ప్రేమ కుమారిది కంభం మండలంలోని చిన్న కంభం గ్రామం. భార్యపై అనుమానంతో ఈ హత్య చేశాడని సమాచారం. ఘటనా స్థలానికి చేరుకున్న గిద్దలూరు అర్బన్ సీఐ కె.సురేష్ కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
