జిల్లా లో ప్రజలకు తాగునీటి సమస్య లేకుండాచూడాలి.కలెక్టర్.
ఉమ్మడి ప్రకాశం జిల్లా క్రైమ్ 9 మీడియా ప్రతినిధి దాసరి యోబు.
ఒంగోలు ప్రజలకు సురక్షిత తాగునీరు అందించేలా అన్నీ చర్యలు తీసుకోవడంతో పాటు రానున్న వేసవిలో ప్రజలకు తాగునీటి సమస్య ఏర్పడకుండా చేపడుతున్న చర్యలపై హబిటేషన్ వారీగా కార్యాచరణ ప్రణాళికను రూపొందించాలని జిల్లా కలెక్టర్ శ్రీ పి. రాజాబాబు, అధికారులను ఆదేశించారు.
మంగళవారం కలెక్టరేట్ లోని తన ఛాంబర్ లో జిల్లా కలెక్టర్ పి రాజాబాబు, ఆర్డబ్ల్యుఎస్, పంచాయతీ రాజ్, ఇరిగేషన్, గ్రౌండ్ వాటర్, డ్వామా తదితర శాఖల అధికారులతో సమావేశమై, రానున్న వేసవిలో ప్రజలకు తాగునీటి సమస్య ఏర్పడకుండా తీసుకోవాల్సిన చర్యలపై, జల సురక్షా కార్యక్రమం ద్వారా ప్రజలకు సురక్షిత తాగునీరు అందించేలా చేపడుతున్న చర్యల పురోగతిపై సమీక్షించి దిశానిర్దేశం చేసారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ,
ప్రజలకు సురక్షిత తాగునీరు అందించేలా గత డిసెంబర్ మాసంలో జిల్లా వ్యాప్తంగా జల సురక్ష మాసం నిర్వహించి ట్యాంకుల క్లీనింగ్, ట్యాప్స్, బోర్ వెల్స్ మరమత్తులు, ఫిల్టర్ బెడ్స్ మార్చడం, వాటర్ టెస్టింగ్ వంటి కార్యక్రమాలు మిషన్ మోడ్ లో చేపట్టడం జరిగిందన్నారు. అదే విధానాన్ని కొనసాగిస్తూ ప్రజలకు సురక్షిత తాగునీరు అందించేలా చర్యలు తీసుకోవాలన్నారు. అలాగే వేసవి లో ట్యాంక్స్ , ఫీడర్ కెనాల్స్ పూడిక తీత, జంగిల్ క్లియరెన్స్ వంటి కార్యక్రమాలను చేపట్టేలా ప్రతిపాదనలు సిద్దం చేయాలన్నారు. జిల్లా లోని అన్నీ గ్రామా పంచాయతీల్లో ఎంత నీరు అందుబాటులో వుంది, ఎంత నీటిని వినియోగించడం జరుగుచున్నది, ఇంకా ఎంత నీటి అవసరం వుంది తదితర విషయాలను క్షుణ్ణంగా అధ్యయనం చేసి హబిటేషన్ వారీగా కార్యాచరణ ప్రణాళికను రూపొందించాలని కలెక్టర్, అధికారులను ఆదేశించారు. గ్రామాల్లో ప్రభుత్వ, ప్రవేటు ఆర్ ఓ ప్లాంట్స్ ఎన్ని ఉన్నాయి, ప్రజలు ఎంత మోతాదులో బబుల్ వాటర్ ను వినియోగిస్తున్నారు తదితర వివరాలతో సమగ్ర నివేదిక సిద్దం చేయాలని జిల్లా కలెక్టర్ అధికారులను ఆదేశించారు.
ఈ సమావేశంలో జిల్లా పరిషత్ సి ఈ ఓ, చిరంజీవి, ఆర్డబ్ల్యూఎస్ ఎస్ ఈ,నాగేశ్వర రావు, ఇరిగేషన్ ఎస్ఈ శ్రీమతి వరలక్ష్మి, డి పి ఓ,వెంకటేశ్వర రావు, డ్వామా పి డి, జోసెఫ్ కుమార్, జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డా. వెంకటేశ్వర రావు, గ్రౌండ్ వాటర్ డి డి శ్రీనివాస రావు, తదితరులు పాల్గొన్నారు.
