ఎన్టీఆర్ నూతన గృహ ప్రవేశం వేడుకలో పాల్గొన్న ఎమ్మెల్యే ముత్తుముల.


 ఎన్టీఆర్ నూతన గృహ ప్రవేశం వేడుకలో పాల్గొన్న ఎమ్మెల్యే ముత్తుముల.

ఉమ్మడి ప్రకాశం జిల్లా క్రైమ్ 9 మీడియా ప్రతినిధి దాసరి యోబు.

 మార్కాపురం జిల్లా గిద్దలూరు పట్టణంలోని మోడంపల్లె లే అవుట్ ప్రక్కన ఎన్టీఆర్ కాలనీ నందు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గృహ నిర్మాణ సంస్థ ద్వారా గిద్దలూరు పట్టణంలోని నూతన గృహ నిర్మాణంలో భాగంగా కొత్త లక్ష్మీ దేవి & సుబ్బరత్నం దంపతులకు నూతన గృహ మంజూరు అయిన సందర్భంగా గిద్దలూరు శాసనసభ్యులు ముత్తుముల అశోక్ రెడ్డి పాల్గొని వారికి శుభాకాంక్షలు తెలిపారు. 

గిద్దలూరు శాసనసభ్యులు ముత్తుముల మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం పేద ప్రజలకు అండగా ఉంటుందని ఇళ్లు లేని వారికి గృహ నిర్మాణ సంస్థ ద్వారా లబ్ధి చేకూరేలా ప్రభుత్వం అండగా ఉంటుందని పేదలకు కూడు - గుడ్డ అందించడమే ప్రభుత్వం లక్ష్యంగా సాగుతోందని, వేసవిని దృష్టిలో ఉంచుకొని త్రాగునీరు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.

ఈకార్యక్రమంలో గృహ నిర్మాణ సంస్థ అధికారులు, పురపాలక సంఘంఅధికారులు,సచివాలయం అధికారులు,పలు శాఖల సిబ్బంది, మార్కెట్ యార్డ్ చైర్మన్ డాక్టర్ బైలడుగు బాలయ్య, వైస్ చైర్మన్ గోడి ఓబుల్ రెడ్డి,పాలుగుళ్ల ప్రతాప్ రెడ్డి, పాలుగుళ్ల చిన్న శ్రీనివాస్ రెడ్డి,కడియం శేషగిరి, కౌన్సిలర్లు లొక్కు రమేష్, దెమా నర్సింహులు, స్థానిక నాయకులు కార్యకర్తలు గృహ లబ్ధిదారులు ప్రజలు తదితరులు గృహ ప్రవేశం వేడుకలో పాల్గొన్నారు.

Post a Comment

Please Select Embedded Mode To Show The Comment System.*

Previous Post Next Post