రాజకీయ పార్టీల నాయకులతో సమావేశం డి ఆర్ వో.


రాజకీయ పార్టీల నాయకులతో సమావేశం డి ఆర్ వో.

 ఉమ్మడి ప్రకాశం జిల్లా క్రైమ్ 9 మీడియా ప్రతినిధి దాసరి యోబు.

ఒంగోలు కలెక్టరేట్ నందు గల జిల్లా రెవెన్యూ అధికారి చాంబర్ లో గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల సభ్యులతో సమావేశం జరిగింది, ఈ కార్యక్రమం జిల్లా రెవెన్యూ అధికారి చిన ఓబులేసు ఆధ్వర్యంలో జరిగింది, 

 ఈ సందర్భంగా జిల్లా రెవెన్యూ అధికారి మాట్లాడుతూ, జిల్లా లో ఏప్రిల్ లో జన గణన ప్రక్రియ ప్రారంభం అవుతుందని తెలిపారు.

 అలాగే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందన్నారు. మ్యాపింగ్ ప్రక్రియలో నిర్లక్ష్యం వహించిన బూత్ లెవెల్ అధికారుల పైన చర్యలు తీసుకోవటం జరుగుతుందని అన్నారు . జిల్లాలోని అన్ని నియోజకవర్గలలో చనిపోయిన వారి ఓట్లు ఈ SIR కార్యక్రమంతో తొలిగిపోతాయని తెలిపారు. 

అన్ని నియోజకవర్గలలో పోలింగ్ బూత్ లెవల్ ఏజెంట్ల ను అన్ని రాజకీయ పార్టీల వారు ఏర్పాటు చేసుకోవాలని కోరారు. 18 సంవత్సరాలు నిండిన యువత ఓట్లు నమోదు చేసుకోవాలని కోరారు.

ఈ కార్యక్రమంలో జిల్లా ఎలక్షన్ సెల్ సూపరింటెండెంట్ 

శ్రీనివాసరావు, రాజకీయ పార్టీల ప్రతినిధులు వైసీపీ తరుపున దామరాజు క్రాంతికుమార్, కాంగ్రెస్ పార్టీ తరుపున రసూల్, టీడీపీ తరపున B పూర్ణచంద్రరావు, బీజేపీ తరపున గుర్రం సత్యం, సిపిఎం తరపున రఘురామ్, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.
 

Post a Comment

Please Select Embedded Mode To Show The Comment System.*

Previous Post Next Post