రాష్ట్రంలో రీ సర్వే పట్టాదారు పాస్ పుస్తకాలు రెండో విడత పంపిణీ.



 రాష్ట్రంలో రీ సర్వే పట్టాదారు పాస్ పుస్తకాలు రెండో విడత పంపిణీ. 

ఉమ్మడి ప్రకాశం జిల్లా క్రైమ్ 9 మీడియా ప్రతినిధి దాసరి యోబు.

ఒంగోలు, పట్టాదార్ పాస్ పుస్తకాల పంపిణీలో ఎటువంటి పొరపాట్లకు తావులేకుండా పటిష్టంగా పంపిణీ జరిగేలా చూడాలని సిసిఎల్ఎ ముఖ్య కమిషనర్ జి. జయలక్ష్మి, జిల్లా కలెక్టర్లకు సూచించారు. 

రాష్ట్రంలో రీ సర్వే, పట్టాదార్ పాస్ పుస్తకాల రెండవ విడత పంపిణీ, తదితర అంశాలపై రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జి. సాయిప్రసాద్ తో కలిసి రాష్ట్రంలోని జిల్లా కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లు, డిఆర్ఓ లు, ఆర్డీఓ లతో రాష్ట్ర భూ పరిపాలనా శాఖ ముఖ్య కమిషనర్ మంగళవారం రాష్ట్ర సచివాలయం నుండి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఈ సందర్భంగా ముఖ్య కమిషనర్ జి. జయలక్ష్మి మాట్లాడుతూ పట్టాదార్ పాస్ పుస్తకాల పంపిణీలో ఎటువంటి పొరపాట్లకు తావులేకుండా చూడాలన్నారు. 

రైతులకు ఎక్కడా ఏ సమస్య రాకుండా పాస్ పుస్తకాల పంపిణీని పూర్తిచేయాలన్నారు.

 ప్రకాశం జిల్లా ఒంగోలు కలెక్టరేట్ నుండి జిల్లా కలెక్టర్ పి. రాజాబాబు, జాయింట్ కలెక్టర్ శ్రీమతి కల్పనా కుమారి, జిల్లా రెవెన్యూ అధికారి చిన ఓబులేసు, ఎస్ఈ ఇరిగేషన్ శ్రీమతి వరలక్ష్మి, కలెక్టరేట్ ల్యాండ్ సెక్షన్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

Please Select Embedded Mode To Show The Comment System.*

Previous Post Next Post