బైక్ అదపు తప్పి వ్యక్తి మృతి.
అనకాపల్లి ఫిబ్రవరి:09
చోడవరం బిహార్ రాష్ట్రం, గయా జిల్లా, ఇమామ్ గంజ్ మండల్, సుహెయిల్ గ్రామ కాపురస్తులు అయిన మహమ్మద్ వారిష్ ఖాన్ మరియు అతని తమ్ముడు మొహమ్మద్ షరీక్యూ
అనకాపల్లి గవరపాలెంలో నివాసం ఉంటూ గ్లైనేట్ మరియు మార్బుల్ పని చేసుకొని జీవిస్తున్నట్లు, అయితే శనివారం అనగా తేది 07-02-2026 దిన ఉదయం సుమారు 9 గంటల సమయంలో మొహమ్మద్ షరీక్యూ ఖాన్.షానవాజ్ లు కలసి AP31 DB 7547 నెంబరు గల స్పెండర్ ప్లస్ మోటార్ సైకిల్ మీద అనకాపల్లిలోని గవరపాలెం నుండి బయలు దేరి కే. కోటపాడు మార్బుల్ పని చెయ్యడానికి వెళ్లి, అక్కడ రాత్రి సుమారు 11 గంటల వరకు పని చేసుకొని తిరిగి షరీక్యూ ఖాన్ మరియు షానవాజ్ ఇద్దరు కలసి అదే మోటార్ సైకిల్ మీద కే.కోటపాడు నుండి బయలు దేరి షరీక్యూ ఖాన్ మోటార్ సైకిల్ నడుపుతూ గవరపాలెం వస్తుండగా, మార్గ మధ్యలో రాత్రి సుమారు 11-30 గంటలకు చోడవరం మండలం నరసాపురం బ్రిడ్జి దగ్గరకు వచ్చే సమయంలో బండికి అడ్డంగా ఒక పిల్లి రావడం వలన దానిని తప్పించి క్రమంలో సడన్ బ్రేకు వేసే సరికి షరీక్యూ ఖాన్ నడుపుతున్న మోటార్ సైకిల్ ప్రమాద వశాత్తు రోడ్డు మీద స్కిడ్ అయ్యి మోటార్ సైకిల్ మీద ఉన్న ఇద్దరు రోడ్డు మీద పడిపోవడంతో పిర్యాది తమ్ముడికి బలమైన గాయాలు అయినట్లు, సదరు మోటార్ సైకిల్ మీద వెనుక కూర్చున్న షానవాజ్ కు ఎడమ చేతికి బలమైన గాయం తగలగా అక్కడ ఉన్నవారు 108 అంబులెన్సులో చోడవరం గవర్నమెంటు ఆసుపత్రికి తీసుకొని వెళ్తుండగా, షరీక్యూ ఖాన్ మార్గమధ్యలో అతనికి కలిగిన బలమైన గాయాల వలన రాత్రి సుమారు 11-45 గంటల సమయంలో చనిపోయినట్లు ఇచ్చిన రిపోర్ట్ మీద చోడవరం సీఐ పి అప్పలరాజు ఆదేశాల మేరకు ఎస్ఐ అయిన బి.జోగారావు కేసు రిజిస్టర్ చేసి చోడవరం ప్రభుత్వ ఆసుపత్రి నందు శవ పంచనామా నిర్వహించి బాడీ ని బంధువులు కి అప్పగించారు.

