పెద్దబొడ్డపాడులో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ.
లబ్ధిదారులను పరామర్శించిన ఎమ్మెల్యే గౌతు శిరీష.
క్రైమ్ 9 మీడియా ప్రతినిధి శ్రీకాకుళం జిల్లా స్టాఫ్ రిపోర్టర్ శంకర్ తమ్మినాన.
పలాస, జూలై 1:
పలాస నియోజకవర్గం వజ్రపుకొత్తూరు మండలం పెద్దబొడ్డపాడు గ్రామంలో బుధవారం నిర్వహించిన ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె లబ్ధిదారుల నివాసాలకు వెళ్లి స్వయంగా పెన్షన్ అందజేసి, వారి ఆరోగ్య పరిస్థితులు, కుటుంబ పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం సామాజిక భద్రతకు అత్యంత ప్రాధాన్యం ఇస్తోందన్నారు. వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు తదితర అర్హులైన ప్రతి ఒక్కరికీ పెన్షన్లు పారదర్శకంగా, ఎలాంటి ఇబ్బందులు లేకుండా అందేలా ప్రభుత్వం చర్యలు చేపట్టిందని పేర్కొన్నారు. ప్రజలకు అవసరమైన ప్రభుత్వ సేవలను ఇంటి వద్దకే చేరవేయడం ప్రభుత్వ లక్ష్యమని, సంక్షేమంతో పాటు అభివృద్ధిని సమన్వయం చేస్తూ ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరిచేందుకు కూటమి ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోందని తెలిపారు.
కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, గ్రామ పెద్దలు, లబ్ధిదారులు, గ్రామస్తులు పాల్గొన్నారు.

