ఉద్యోగుల సమస్యలను పరిష్కరించకుంటే ఉద్యమం తప్పదు,
ఉద్యోగులు అందరు ఉద్యమానికి సిద్దం కావలి - APJAC అమరావతి.
క్రైమ్ 9మీడియా ప్రతినిధి సన్నీ చక్రవర్తి.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు గడుస్తున్నా ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు మరియు కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ సిబ్బంది సమస్యలను పరిష్కరించ లేదు APJAC అమరావతి
ఏలూరు జిల్లా చైర్మన్ శ్రీ కే. రమేష్ కుమార్ గారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉద్యోగుల హక్కుల సాధనకై డివిజన్ మరియు జిల్లా స్థాయిల్లో సన్నాహక సమావేశాలు నిర్వహించి, అవసరమైతే ప్రత్యక్ష ఉద్యమానికి సిద్ధమవుతున్నట్లు ఆయన ప్రకటించారు. అందులో భాగముగా ఈ రోజు ఏలూరు డివిజన్ సమావేశము నిర్వహించారు. ఈ సందర్భంగా సంఘం తరపున డిమాండ్లను డివిజన్ సమావేశంలో వెల్లడించారు:
*12వ పీఆర్సీ కమిషన్ నియమించాలి:* * 2023 జూలై నాటికే వేయాల్సిన 12వ పీఆర్సీ (12th PRC) కమిషన్‌ను మూడేళ్లు దాటినా ప్రభుత్వం ఇప్పటివరకు నియమించలేదు. దీనిని వెంటనే ఏర్పాటు చేసి, ఉద్యోగులకు కనీసం 30% తగ్గకుండా మధ్యంతర భృతి (IR) ప్రకటించాలి.
**డీఏ బకాయిలు చెల్లించాలి:* పెరుగుతున్న నిత్యావసర ధరలకు అనుగుణంగా ఇవ్వాల్సిన బకాయి డీఏలను (పెండింగ్ లో ఉన్న నాలుగు DAలు) వెంటనే విడుదల చేయాలి. ఉద్యోగులకు రావాల్సిన రూ. 33 వేల కోట్ల బకాయిల చెల్లింపుపై ప్రభుత్వం స్పష్టమైన రూట్ మ్యాప్ ప్రకటించాలి.
*ఉపయోగపడని హెల్త్ కార్డులు:** ప్రస్తుత ఈహెచ్ఎస్ (EHS) హెల్త్ కార్డులు ఏ ప్రైవేట్ ఆసుపత్రిలోనూ పని చేయడం లేదు. గతంలో 90 రోజుల్లో సమస్యను సర్దుబాటు చేస్తానని ముఖ్యమంత్రి గారు స్వయముగా హామీ ఇచ్చి 300 రోజులు దాటినా ఎలాంటి చర్యలు తీసుకోలేదు.
*సీపీఎస్ రద్దు హామీ ఏమైంది?:* * ఎన్నికల ప్రచారంలో ఏడాదిలోగా సీపీఎస్ (CPS) రద్దు చేస్తానని హామీ ఇచ్చిన ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, అధికారంలోకి వచ్చి రెండేళ్లు అవుతున్నా ఇప్పటివరకు ఆ ఊసే ఎత్తడం లేదు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి ముఖ్యమంత్రి గారు స్వయంగా జోక్యం చేసుకొని ఈ సమస్యలను పరిష్కరించాలని, లేనిపక్షంలో గతంలో వలె సుదీర్ఘ పోరాటానికైనా వెనకాడబోమని APJAC అమరావతి స్పష్టం చేసింది.
ఈ కార్యక్రమములో రాష్ట్ర కో - చైర్మెన్ కే. శ్రీనివాస్, జిల్లా జనరల్ సెక్రెటరి బి. రాంబాబు, మహిళా విభాగము చైర్ పర్సన్ శ్రీమతి గీతిక, వైస్ చైర్మన్ బి. సత్యనారాయణ, నాగేశ్వర రావు, పెన్షన్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు ఎం. మహాలక్ష్మి , డ్రైవర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు ఎ. శ్రీనివాస రావు, గ్రామా వార్డ్ సచివాలయ ఉద్యోగుల జిల్లా అధ్యక్షులు కమల్, ప్రభాకర రావు వివిధ సంఘముల నాయకులూ పాల్గొన్నారు.


