అంబరాన్నంటేలా దివంగత ఎన్ టి ఆర్ 103వ జయంతివేడుకలు.
భవిష్యత్తును బంగారు మయం చేసే సమర్థత తెలుగుదేశం పార్టీకే ఉంది - ఎమ్మెల్యే బడేటి చంటి.
ఏలూరు - మే, 28. క్రైమ్ 9మీడియా ప్రతినిధి శరత్.
భావి తరాల భవిష్యత్తును బంగారు మయం చేసే సమర్థత తెలుగుదేశం పార్టీకే ఉందని ఆ పార్టీ జిల్లా అధ్యక్షులు, ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి స్పష్టం చేశారు. టిడిపి వ్యవస్థాపకులు, మాజీ ముఖ్యమంత్రి, దివంగత ఎన్టీఆర్ ఆశయాలను బాధ్యతగా ముందుకు తీసుకెళ్తోన్న ముఖ్యమంత్రి చంద్రబాబు, రాష్ట్ర మంత్రి నారా లోకేష్‌లతోనే అది సాధ్యమని ఆయన పునరుద్ఘాటించారు. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు, మాజీ ముఖ్యమంత్రి, దివంగత నందమూరి తారక రామారావు 103వ జయంతి సందర్భంగా గురువారం ఏలూరు ఫైర్ స్టేషన్ సెంటర్‌లో ఉన్న ఆయన కాంస్య విగ్రహం వద్ద వేడుకలను అంబరాన్నంటేలా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిధిగా పాల్గొన్న జిల్లా పార్టీ అధ్యక్షులు, ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటికి ఆత్మీయ స్వాగతం లభించింది. అనంతరం పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి ఎన్టీఆర్ విగ్రహానికి భారీ గజమాల వేసిన ఎమ్మెల్యే చంటి,,, ఆయనకు ఘన నివాళులర్పించారు. అనంతరం పార్టీ శ్రేణులకు, ప్రజలకు మిఠాయిలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బడేటి చంటి మాట్లాడుతూ ఎన్టీఆర్ లాంటి మాన్యులు ఆంధ్రప్రదేశ్‌లో జన్మించడం తెలుగు వారు చేసుకున్న అదృష్టమని వ్యాఖ్యానించారు. ఆయన ఆలోచనల నుండి పుట్టిన టిడిపిని విజయపథంలో ముందుకు తీసుకెళ్ళోన్న ముఖ్యమంత్రి చంద్రబాబు, రాష్ట్ర మంత్రి నారా లోకేష్‌లకు పార్టీ కార్యకర్తలంతా మరింత సహకరించాలని, పార్టీని ప్రజల్లోకి మరింత విస్త్రృతంగా తీసుకెళ్ళేందుకు పరిశ్రమించాలని పిలుపునిచ్చారు. భావి తరాల భవిష్యత్తు బాగుండాలంటే తెలుగుదేశం పార్టీతోనే సాధ్యమన్న ఎమ్మెల్యే చంటి,,, ఏ రాజకీయ పార్టీ రేపటి తరాల కోసం ఆలోచన చేసిందే లేదంటూ వ్యాఖ్యానించారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని ప్రజలంతా టిడిపికి సంపూర్ణ మద్దతు తెలపాలని, రాష్ట్రాభివృద్ధిలో భాగస్వాములు కావాలని ఎమ్మెల్యే చంటి పిలుపునిచ్చారు. కార్యక్రమంలో టిడిపి నగర కార్యదర్శి రెడ్డి నాగరాజు, కో-ఆప్షన్ సభ్యులు ఎస్సెమ్మార్ పెదబాబు, నియోజకవర్గ పరిశీలకులు షేక్ మీరావలి ,పలువురు క్లస్టర్ ఇంచార్జిలు, డివిజన్ ఇంచార్జీలు, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు

