అత్తా కోడళ్ళ వివాదం - అత్తను బలి తీసుకున్న కోడలు.


 అత్తా కోడళ్ళ వివాదం  - అత్తను బలి తీసుకున్న కోడలు.

క్రైమ్ 9 మీడియా ప్రతినిధి జోనల్ ఇంచార్జి పి మహేశ్వరావు.

అనకాపల్లి : మే 28, 

చోడవరం మండలంలోని వెంకన్నపాలెం గ్రామంలో గురువారం అత్త–కోడళ్ల మధ్య ఘర్షణ విషాదానికి దారితీసింది.

గ్రామానికి చెందిన కె. పసలమ్మ (55)ను కోడలు కరకా నాగమణి తీవ్రంగా గాయపరచిన వైనంలో అత్త తీవ్రంగా గాయపడింది.  

ఎడమ చేతికి తీవ్రంగా గాయపడిన పసలమ్మను వెంటనే ఎన్టీఆర్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు.

అయితే చికిత్స పొందుతూ ఆమె మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.

ఈ ఘటనపై చోడవరం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Post a Comment

Please Select Embedded Mode To Show The Comment System.*

Previous Post Next Post