గిద్దలూరు లో బీజేపీ బి ఎల్ ఎ 2 సమీక్షా సమావేశం నిర్వహించిన బీజేపీ నాయకులు.
ఉమ్మడి ప్రకాశం జిల్లా క్రైమ్ 9మీడియా ప్రతినిధి దాసరి యోబు.
భారతీయ జనతా పార్టీ జాతీయ రాష్ట్ర జిల్లా అధ్యక్షుల ఆదేశాల మేరకు మార్కాపురం జిల్లా గిద్దలూరు పట్టణ బూత్ కమిటీ లు అధ్యక్షుల నియామకం పూర్తి చేయడానికి గిద్దలూరు పట్టణ అధ్యక్షులు అప్పిశెట్టి ఉదయ్ శంకర్ ఆధ్వర్యం లో సమీక్షా సమావేశం గిద్దలూరు పట్టణ బీజేపీ కార్యాలయం లో జరిగింది.
ఈ సందర్భంగా మాజీ జిల్లా ఉపాధ్యక్షులు భవనాషి వెంకట రామాంజనేయులు మాట్లాడుతూ బి ఎల్ ఎ 1 గా
గిద్దలూరు అసెంబ్లీ డాక్టర్ ఆకుల నాగేష్ ను నియామకం చేయడం జరిగింది ఆయన ఆదేశాల మేరకు గిద్దలూరు పట్టణ 20 పోలింగ్ బూత్ లెవెల్ ఏజెంట్ ఏజెంట్ నియామకం చేయడం ద్వారా పార్టీ గ్రౌండ్ లెవెల్ లో బలోపేతానికి ఎంతో ఉపయోగపడుతుంది అని,అంతే కాకుండా రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల లో బీజేపీ అభ్యర్థుల గెలుపుకు ఎంతగానో ఉపయోగపడుతుంది అని ఈ సందర్భంగా తెలియ చేయడం జరిగింది.
ఈ కార్యక్రమంలో మాజీ జిల్లా ఎస్ సి మోర్చా ప్రధాన కార్యదర్శి మట్టే మల్ల పుల్లయ్య,పట్టణ బీజేపీ నాయకులు జనార్ధన్ పాల్గొనడం జరిగింది.
