మందస మండలంలో ఘనంగా ఎన్టీఆర్ జయంతి వేడుకలు – ముఖ్య అతిథిగా హాజరైన పలాస సమన్వయకర్త వెంకన్న చౌదరి.


 మందస మండలంలో ఘనంగా ఎన్టీఆర్ జయంతి వేడుకలు – ముఖ్య అతిథిగా హాజరైన పలాస సమన్వయకర్త వెంకన్న చౌదరి.

క్రైమ్ 9 మీడియా ప్రతినిధి శ్రీకాకుళం జిల్లా స్టాఫ్ రిపోర్టర్ శంకర్ తమ్మినాన.

​పలాస/మందస:

తెలుగు ప్రజల ఆరాధ్యదైవం, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు, స్వర్గీయ నందమూరి తారకరామారావు (ఎన్టీఆర్) జయంతి వేడుకలు పలాస నియోజకవర్గం మందస మండలంలో అత్యంత వైభవంగా జరిగాయి. మండలంలోని హరిపురం, బాలిగాం మరియు మందస టౌన్‌లలో పార్టీ శ్రేణులు, అభిమానులు ఈ వేడుకలను పండుగ వాతావరణంలో నిర్వహించారు.

​ఈ కార్యక్రమాలకు పలాస నియోజకవర్గ సమన్వయకర్త శ్రీ వెంకన్న చౌదరి గారు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆయా ప్రాంతాల్లో ఉన్న ఎన్టీఆర్ విగ్రహాలకు ఆయన పూలమాలలు వేసి, ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా శ్రీ వెంకన్న చౌదరి గారు మాట్లాడుతూ.. తెలుగు జాతి ఖ్యాతిని ప్రపంచవ్యాప్తం చేసిన మహోన్నత నాయకుడు ఎన్టీఆర్ అని కొనియాడారు. ఆయన ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.

​అనంతరం కార్యకర్తలు, నాయకులు పెద్ద ఎత్తున "జోహార్ ఎన్టీఆర్", "ఎన్టీఆర్ అమర్ రహే" అంటూ చేసిన నినాదాలతో మందస మండలం మారుమోగింది. ఈ వేడుకల్లో గ్రంథాలయ చైర్మన్ విఠల్ గారితో పాటు మందస మండల ముఖ్య నాయకులు, అనుబంధ సంఘాల ప్రతినిధులు, మరియు భారీ సంఖ్యలో పార్టీ కార్యకర్తలు, ప్రజలు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

Post a Comment

Please Select Embedded Mode To Show The Comment System.*

Previous Post Next Post