బంగారు దుకాణల యజమానులు జాగ్రత్తలు తీసుకోవాలి అర్బన్ సీఐ కె.సురేష్,.


 బంగారు దుకాణల యజమానులు జాగ్రత్తలు తీసుకోవాలి అర్బన్ సీఐ కె.సురేష్,.

ఉమ్మడి ప్రకాశం జిల్లా క్రైమ్ 9 మీడియా ప్రతినిధి దాసరి యోబు.

మార్కాపురం జిల్లా గిద్దలూరు పట్టణంలోని బంగారు దుకాణ యజమానులకు బుధవారం గిద్దలూరు అర్బన్ సీఐ కె సురేష్ అవగాహన కార్యక్రమం నిర్వహించారు.

ఈ సందర్భంగా పట్టణంలోని బంగారు దుకాణ యజమానులతో ఆయన మాట్లాడుతూ ప్రతి బంగారు దుకాణ యజమాని దుకాణంలో సీసీ కెమెరాలు తప్పక ఏర్పాటుచేసుకోవాలని, 

అలాగే దుకాణానికి అనుమానాస్పద, కొత్త వ్యక్తులపై నిఘా ఉంచాలని, అలాగే దుకాణ పర్యవేక్షణకై సెక్యూరిటీ గార్డులను ఏర్పాటు చేసుకోవాలని అన్నారు 

దుకాణాలలో బర్గ్ లర్ అలారం ఏర్పాటు చేసుకోవాలని, రాత్రి వేళల్లో దుకాణం బయట తగిన కాంతి వంతమైన విద్యుత్తు లైట్లు ఏర్పాటు చేసుకోవాలన్నారు 

అలాగే దుకాణంలో కొత్తగా చేరిన సిబ్బంది వివరాలు సేకరించి ఉంచుకోవాలని, ఇంకా పలు జాగ్రతలపై అవగాహన కల్పించారు.

ఈ కార్యక్రమంలో గిద్దలూరు బంగారు దుకాణ యజమానుల పాల్గొన్నారు

Post a Comment

Please Select Embedded Mode To Show The Comment System.*

Previous Post Next Post