పేపర్ లీకేజీ మాఫియాను చట్టం ముందు నిలబెట్టాలి - శిష్టు గోపి.
క్రైమ్ 9 మీడియా ప్రతినిధి శ్రీకాకుళం జిల్లా స్టాఫ్ రిపోర్టర్ శంకర్.
దేశం కోసం చదువుతున్న విద్యార్థుల భవిష్యత్తును కొంతమంది రాజకీయ దందాగాళ్లు వేలం వేస్తుంటే…ఇది కేవలం పేపర్ లీక్ కాదు.దేశ ప్రతిభను,పేదల ఆశలను, యువత భవిష్యత్తును హత్య చేసే నేరమని వైస్సార్సీపీ పలాస పట్టణ అధ్యక్షులు శిష్టు గోపి అన్నారు
నీట్ లాంటి పరీక్ష కోసం లక్షలాది మంది విద్యార్థులు ఏళ్ల తరబడి నిద్ర మానేసి చదువుతుంటే ఇంకో వైపు డబ్బు, రాజకీయ అండ, మాఫియా లింకులతో ప్రశ్నపత్రాలు కొనేసుకుని సీట్లు దోచుకుంటున్నారని
రాజస్థాన్‌లో బీజేపీ నాయకుడు దినేష్ బింవాల్ అరెస్ట్ కావడం ఈ వ్యవస్థ ఎంత కుళ్లిపోయిందో బయటపెడుతోందని
రూ.30 లక్షలకు పేపర్ కొనడం వాట్సాప్ గ్రూపుల ద్వారా పంపిణీ చేయడం ఇది ఒక్క వ్యక్తి పని కాదు, దేశాన్ని పురుగులా కొరుకుతున్న ఒక పెద్ద రాజకీయ-ఎగ్జామ్ మాఫియా పని అని వ్యాపం నుంచి NEET వరకూ…
TET నుంచి పోలీస్ రిక్రూట్‌మెంట్ వరకూ…ఎక్కడ చూసినా లీకులు, దందాలు, అవినీతని అయితే బాధ మాత్రం ఎప్పుడూ పేద విద్యార్థిదే. ఒక రైతు తన పొలం అమ్మి కొడుకును కోచింగ్‌కు పంపిస్తాడు…
ఒక తల్లి బంగారం తాకట్టు పెట్టి కూతురిని చదివిస్తుంది కానీ చివరికి సీటు దక్కేది డబ్బుతో ప్రశ్నపత్రం కొనేసుకున్న దందాగాడి పిల్లలకా.. అని ప్రశ్నించారు.ఇది విద్యా వ్యవస్థ కాదు…ప్రతిభను ఉరి తీయించే అవినీతి రాజ్యం.దేశభక్తి పేర్లు పెట్టుకుని తిరిగే నాయకులు దేశ యువత భవిష్యత్తునే అమ్ముకుంటే వాళ్లు దేశ సేవకులు కాదు దేశ ద్రోహులవుతారు అని అన్నారు.
యువత జీవితాలతో ఆడుకునే ఈ ఎగ్జామ్ మాఫియాలను చట్టం ముందు నిలబెట్టి కఠినంగా శిక్షించాలని లేకపోతే రేపటి తరం“చదివితే కాదు… డబ్బుంటేనే గెలుస్తాం” అనే నమ్మకంతో పెరుగుతుందని అది ఏ దేశానికైనా అత్యంత ప్రమాదకరమైన పతనమని అన్నారు.
