మత్స్యకారుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం పెద్దపీట.
క్రైమ్ 9 మీడియా ప్రతినిధి శ్రీకాకుళం జిల్లా స్టాఫ్ రిపోర్టర్ శంకర్ తమ్మినాన.
వేట విరామానికి సీఎం భరోసా ఆర్థిక సాయం రూ.20 వేలకు పెంపు – ఎమ్మెల్యే గౌతు శిరీష.
ప్రజా శ్రేయస్సు, పేదల సంక్షేమమే కూటమి ప్రభుత్వ ప్రధాన ధ్యేయమని పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష గారు పేర్కొన్నారు. మత్స్యకారుల జీవనోపాధిని దృష్టిలో ఉంచుకుని రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న సంక్షేమ నిర్ణయాలు వారికి ఆర్థికంగా బలాన్నిస్తాయని ఆమె తెలిపారు. వేట విరామ సమయంలో ఉపాధి కోల్పోయే మత్స్యకార కుటుంబాలకు అండగా నిలిచేందుకు “సీఎం భరోసా” పథకం కింద అందించే ఆర్థిక సహాయాన్ని రూ.10 వేల నుంచి రూ.20 వేలకు పెంచడం ప్రభుత్వం తీసుకున్న చారిత్రాత్మక నిర్ణయమని ఎమ్మెల్యే గౌతు శిరీష కొనియాడారు.
రాష్ట్రవ్యాప్తంగా సుమారు 1.3 లక్షల మంది మత్స్యకార కుటుంబాలకు ఈ పథకం ద్వారా నేరుగా లబ్ధి చేకూరుతుందని ఆమె తెలిపారు. సముద్రంలో వేట నిషేధం అమలులో ఉన్న సమయంలో మత్స్యకారులు ఉపాధి లేక ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటారని, అలాంటి సమయంలో ప్రభుత్వం అందిస్తున్న ఈ ఆర్థిక భరోసా వారికి ఎంతో ఉపయుక్తంగా ఉంటుందని పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం ఎల్లప్పుడూ కష్టజీవుల పక్షాన నిలుస్తూ వారి అభ్యున్నతికి కట్టుబడి పనిచేస్తోందని ఆమె స్పష్టం చేశారు.
శ్రీకాకుళం కలెక్టరేట్‌లో నిర్వహించిన “మత్స్యకారులకు వేటవిరామానికి సీఎం భరోసా” కార్యక్రమంలో జిల్లా కలెక్టర్, సహచర ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులతో కలిసి ఎమ్మెల్యే గౌతు శిరీష పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రతి సంక్షేమ పథకం అర్హులైన ప్రతి కుటుంబానికి చేరేలా అధికార యంత్రాంగం సమన్వయంతో పనిచేస్తోందన్నారు. మత్స్యకారుల సంక్షేమం కోసం మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు.
మత్స్యకారుల జీవన ప్రమాణాలను మెరుగుపరచడం, వారికి ఆర్థిక భద్రత కల్పించడం, కుటుంబాలకు స్థిరత్వం ఇవ్వడం లక్ష్యంగా ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తోందని ఎమ్మెల్యే వివరించారు. రాష్ట్ర అభివృద్ధిలో మత్స్యకారుల పాత్ర ఎంతో కీలకమని, వారి సంక్షేమం ప్రభుత్వ బాధ్యతగా భావిస్తున్నామని అన్నారు.
ఈ కార్యక్రమంలో కూటమి ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, నాయకులు, జిల్లా అధికార యంత్రాంగం, మత్స్యకారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ చర్యల పట్ల మత్స్యకారులు హర్షం వ్యక్తం చేస్తూ ముఖ్యమంత్రి మరియు ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.

