మార్కాపురం జిల్లా నూతన డి ఇ ఒ కి తెలుగు నాడు ఉపాధ్యాయ సంఘం ఘన సన్మానం.


 మార్కాపురం జిల్లా నూతన డి ఇ ఒ కి తెలుగు నాడు ఉపాధ్యాయ సంఘం ఘన సన్మానం.

ఉమ్మడి ప్రకాశం జిల్లా క్రైమ్ 9మీడియా ప్రతినిధి దాసరి యోబు.

మార్కాపురం నూతనంగా మార్కాపురం జిల్లా విద్యాశాఖాధికారిగా బాధ్యతలు స్వీకరించిన సామా సుబ్బారావు గారిని తెలుగు నాడు ఉపాధ్యాయ సంఘం, మార్కాపురం జిల్లా శాఖ ఆధ్వర్యంలో సోమవారం మర్యాదపూర్వకంగా కలిసి ఘనంగా సన్మానించారు.

స్థానిక DEO కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో సంఘ నాయకులు సుబ్బారావు గారిని శాలువాతో సత్కరించి, పుష్పగుచ్ఛం అందజేసి అభినందనలు తెలిపారు. అనంతరం సంఘం తరఫున 2026 నూతన సంవత్సర క్యాలెండర్, డైరీలను బహూకరించారు.

ఈ సందర్భంగా సంఘ నాయకులు మాట్లాడుతూ, నూతన జిల్లాగా ఏర్పడిన మార్కాపురంలో విద్యారంగం అభివృద్ధికి, ఉపాధ్యాయ సమస్యల పరిష్కారానికి డి ఈ ఒ చొరవ చూపాలని కోరారు. 

జిల్లా విద్యాభివృద్ధికి తెలుగు నాడు ఉపాధ్యాయ సంఘం తరఫున సంపూర్ణ సహకారం అందిస్తామని వారు హామీ ఇచ్చారు.

డి ఇ ఒ.సామా సుబ్బారావు మాట్లాడుతూ, ఉపాధ్యాయ సంఘాల సహకారంతో జిల్లాలో విద్యా ప్రమాణాలు పెంచేందుకు కృషి చేస్తానని, మరియు త్వరలోనే జిల్లా వ్యాప్తంగా ఒకటవ తరగతి ఎన్రోల్మెంటుకు ప్రత్యేక డ్రైవ్ నిర్వహించాలని దీనికి ఉపాధ్యాయ సంఘాలు సహకరించాలని కోరారు మరియు ఉపాధ్యాయుల సమస్యలను ప్రాధాన్యతా క్రమంలో పరిష్కరిస్తానని తెలిపారు.

ఈ కార్యక్రమంలో టి ఎన్ యు ఎస్ రాష్ట్ర మైనారిటీ కన్వీనర్ యస్ కె..హెచ్.రెహమాన్, మార్కాపురం జిల్లా అధ్యక్షులు చిట్టెం నాగరాజు, జిల్లా ప్రధాన కార్యదర్శి మండ్ల శ్రీనివాసులు, సహ కార్యదర్శి మందా ప్రసాద్, దొనకొండ మండల అధ్యక్షులు అశోక్ రెడ్డి, నాయకులు కొండయ్య, రమణ, కోటి రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

Please Select Embedded Mode To Show The Comment System.*

Previous Post Next Post