కంభం మండలం టీడీపీ క్లస్టర్–2 ఆధ్వర్యంలో ఘనంగా మహానాడు వర్చువల్ కార్యక్రమం.




 కంభం మండలం టీడీపీ క్లస్టర్–2 ఆధ్వర్యంలో ఘనంగా మహానాడు వర్చువల్ కార్యక్రమం.

ఉమ్మడి ప్రకాశం జిల్లా క్రైమ్ 9 మీడియా ప్రతినిధి దాసరి యోబు.

మార్కాపురం జిల్లా కంభం మండలంలో తెలుగుదేశం పార్టీ క్లస్టర్–2 ఆధ్వర్యంలో మహానాడు కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహిస్తున్నట్లు మండల పార్టీ నాయకులు తెలిపారు.

 పార్టీ ఆవిర్భావ స్ఫూర్తిని గుర్తుచేసుకుంటూ గ్రామ స్థాయి కార్యకర్తల సమన్వయంతో ఈ మహానాడు ఉత్సాహభరిత వాతావరణంలో కొనసాగింది 

పార్టీ బలోపేతం, ప్రజా సమస్యల పరిష్కారం, సంక్షేమ కార్యక్రమాలపై చర్చలు, భవిష్యత్ కార్యాచరణ రూపకల్పన ప్రధాన లక్ష్యాలుగా మహానాడును నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.

 ఈ మహానాడు వర్చువల్ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, యువత మరియు మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ముందుగా పార్టీ వ్యవస్థాపకుడు నందమూరి తారక రామారావు సేవలను స్మరించుకుంటూ ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. 

అలాగే పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు మరియు మరియు జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ నాయకత్వంలో పార్టీ మరింత బలోపేతం కావాలని ఆకాంక్షించారు.

మహానాడులో పార్టీ సిద్ధాంతాలు, అభివృద్ధి కార్యక్రమాలు, ప్రజలకు అందిస్తున్న సేవలపై నాయకులు వివరణ ఇవ్వనున్నట్లు తెలిపారు. క్లస్టర్ పరిధిలోని ప్రతి కార్యకర్త ఈ మహానాడును విజయవంతం చేశారు 

ఈ కార్యక్రమానికి కంభం మండలం తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు తోట వెంకట శ్రీనివాసరావు, క్లస్టర్–2 నాయకులు, మండల స్థాయి నాయకులు. ఎస్సీ సెల్ నాయకులు కార్యకర్తలు మరియు పార్టీ అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.


.

Post a Comment

Please Select Embedded Mode To Show The Comment System.*

Previous Post Next Post