బక్రీద్ పర్వదినాన్ని సుఖశాంతులతో, సోదరభావంతో జరుపుకోవాలి: ఉమ్మడి జిల్లా ఎస్పీ వి. హర్షవర్ధన్ రాజు.
ఉమ్మడి ప్రకాశం జిల్లా క్రైమ్ 9మీడియా ప్రతినిధి దాసరి యోబు.
ప్రకాశం, మార్కాపురం జిల్లాలోని ముస్లిం సోదర సోదరీమణులందరికీ బక్రీద్ పర్వదిన శుభాకాంక్షలు తెలియజేసిన జిల్లా ఎస్పీ.
మానవ జీవితంలో ఎదురయ్యే ఎన్నో కష్టాలు, సవాళ్లను ధైర్యంగా ఎదుర్కొంటూ, దేవునిపై విశ్వాసాన్ని కలిగి సన్మార్గంలో నడవాలని బోధించే పవిత్రమైన పండుగ బక్రీద్ అని జిల్లా ఎస్పీ గారు పేర్కొన్నారు. తమకు ఉన్న దాంట్లో కొంత భాగాన్ని ఇతరులకు పంచిపెట్టే దాతృత్వ భావనను పెంపొందిస్తూ, త్యాగం, ప్రేమ, సత్యానికి ప్రతీకగా నిలిచే బక్రీద్ పండగను ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని జిల్లా ఎస్పీ గారు సూచించారు.
బక్రీద్ పండుగ వేడుకలు, కార్యక్రమాల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా జిల్లా వ్యాప్తంగా పోలీసు శాఖ కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టిందని తెలిపారు. ముందస్తు భద్రతా చర్యల్లో భాగంగా అన్ని మత పెద్దలు, శాంతి కమిటీ సభ్యులతో పోలీసు అధికారులు సమావేశాలు నిర్వహించి, ప్రార్థనలు మరియు ఇతర కార్యక్రమాలు ప్రశాంత వాతావరణంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా సుఖశాంతులతో నిర్వహించుకోవాలని విజ్ఞప్తి చేశారు.
త్యాగానికి, సహనానికి ప్రతీకగా నిలిచే బక్రీద్ పండుగను శాంతి, సామరస్యాలు వెల్లివిరిసేలా భక్తి శ్రద్ధలతో జరుపుకోవాలని ఆకాంక్షిస్తూ ప్రకాశం, మార్కాపురం జిల్లాలలోని ముస్లిం సోదర సోదరీమణులందరికీ ఎస్పీ గారు బక్రీద్ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు.
