వెలుగొండ ప్రాజెక్టు పరిశీలించిన భారీ నీటి పాత్రల శాఖ మంత్రి,నిమ్మల.
ఉమ్మడి ప్రకాశం జిల్లా క్రైమ్ 9 మీడియా ప్రతినిధి దాసరి యోబు.
మార్కాపురం జిల్లా.శ్రీశైలం రిజర్వాయర్ బ్యాక్ వాటర్ లో రెండు గంటల ప్రయాణం చేసి వెలిగొండ ప్రాజెక్టులో కొల్లం వాగు దగ్గర హెడ్ రెగ్యులేటర్ల పనులను పరిశీలించిన భారీ నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు.
అయితే అత్యంత క్లిష్టమైన టన్నెల్స్ లో మొదటి నుంచి చివరి వరకు మొత్తం 18.8 కిలోమీటర్లు ప్రయాణించి పనులను పరిశీలించిన టన్నెల్-2లో 12వ కి.మీ దగ్గర చిక్కుకుపోయిన టి బి ఎం మిషన్ ను పరిశీలించారు
ప్రకాశం జిల్లా ప్రజల జీవితాల్లో వెలుగులు నింపాల్సిన వెలిగొండ ప్రాజెక్ట్ ను జగన్ తన తుగ్లక్ పాలన లో అంధకారం చేశారన్నారు,అబ్రక దబ్రా అంటూ వెలిగొండ ను పూర్తి కాకుండానే, పూర్తయుందని ప్రారంభోత్సవం చేసి జాతికి అంకితం చేసిన మాయల మరాటి జగన్.అన్నారు
కూటమి ప్రభుత్వం 21 నెలల్లో వెలిగొండ పై ప్రత్యేక ద్రుష్టి పెట్టి అష్ట, కష్టాలతో ఊరుకులు, పరుగులతో పని చేస్తున్నాం.
అటువంటిది రెండేళ్ల కిందటే వెలిగొండ పూర్తి అయిపోయిందని జాతికి అంకితం చేయడం ఎంత విడ్డూరం.మోసగాడినని, తనోక దగా కోరునని, అబద్దాలకు తను బ్రాండ్ అంబాసిడర్ ను అని వెలిగొండ విషయం లో జగన్ తనకు తానే రుజువు చేసుకుని చరిత్ర హీనుడయ్యాడన్నారు,
ఆధునిక కాలంలో దుష్ట పరిపాలన, తుగ్లక్ పాలన ఎలావుంటుందో చెప్పడానికి జగన్ పెద్ద ఉదాహరణ.హెడ్ రెగ్యులేటర్ రిటైనింగ్ వాల్, వింగ్స్ కు సంబంధించి ఇప్పటికి 70 శాతం పని పూర్తి అయినదన్నారు,
టన్నెల్ -2 నందు నేటికి మిగిలిన 2400 మీటర్ల లైనింగ్ ను నెలకు 700 మీటర్ల చొప్పున జూన్ కల్లా పూర్తి చేసేలా ట్రాక్ లో పెట్టాం.
ఫీడర్ కెనాల్ పై 500 మీటర్ల హార్డ్ రాక్ తవ్వకం పని పూర్తి చేశామన్నారు.
ఇటీవల చంద్రబాబు చేతుల మీదుగా ప్రారంభించిన ఫీడర్ కెనాల్ 5.3 కి.మీ రిటైనింగ్ వాల్ కాంక్రీట్ నిర్మాణం రెండు నెలల్లోనే 62 శాతం పూర్తి చేశాం.
20 కి. మీ ఫీడర్ కెనాల్ లైనింగ్ నేటికి 5శాతం మాత్రమే పూర్తవ్వగా, మిగిలిన 95 శాతం వేగవంతం చెయ్యాలని ఆదేశించామన్నారు,
ఏప్రిల్ నెల నుండి నిర్వాసితుల కుటుంబాలకు ఆర్ అండ్ ఆర్ బిల్లులు జమ చెయ్యడం ప్రారంభిస్తామని తెలిపారు,.
వెలిగొండ పనులపై చంద్రబాబు ప్రత్యేక ద్రుష్టి పెట్టి 2026 జూన్ కల్లా పూర్తి చేసే లక్ష్యం పెట్టారని తెలిపారు, ఈ పరిశీలనలో మంత్రి వెంట పెనుగొండ ప్రాజెక్టు ఎస్సీ తదితర అధికారులు ఉన్నారు


