బి ఫార్మసీ విద్యార్థిని మరణం పై ఏలూరు డి.ఎస్.పి డి శ్రావణ్ కుమార్ ప్రెస్ మీట్.
▪️ ఏలూరు త్రీ టౌన్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు.
▪️ బి.ఫార్మసీ విద్యార్థిని సువర్షిణి ఆత్మహత్య.
▪️ మొదట అనుమానాస్పద మృతి – తరువాత ప్రేరేపిత ఆత్మహత్యగా నిర్ధారణ.
▪️ క్లాస్మేట్స్ వేధింపులు కారణమని విచారణలో వెల్లడి.
▪️ ప్రైవేట్ చాట్ బయటపెడతామని బెదిరింపులు.
▪️ ఇద్దరు యువకులు అరెస్ట్.
▪️ కేసు దర్యాప్తు కొనసాగుతోంది.
ఏలూరు క్రైమ్ప్ర 9మీడియా ప్రతినిధి సన్నీ చక్రవర్తి .
మార్చి 31. ఏలూరులోని సర్ సి .ఆర్ . రెడ్డి ఫార్మసీ కాలేజ్ కు చెందిన బి.ఫార్మసీ మూడవ సంవత్సరం విద్యార్థిని చిలుకూరి సువర్షిణి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన కలకలం రేపింది. ఈ కేసును మొదట అనుమానాస్పద మృతిగా నమోదు చేసిన పోలీసులు, దర్యాప్తులో ఇది ప్రేరేపిత ఆత్మహత్యగా నిర్ధారించారు.
క్లాస్మేట్స్ అయిన బెల్లం రాటాలు మరియు బూరుగుపల్లి విజయ సారథి మృతురాలిని వ్యక్తిగత చాట్‌ను బయటపెడతామని బెదిరిస్తూ మానసికంగా వేధించినట్లు వెల్లడైంది. ఈ ఒత్తిడిని తట్టుకోలేక సువర్షిణి హాస్టల్ భవనం పై నుంచి దూకి ఆత్మహత్యకు యత్నించగా, హాస్పిటల్ కి తరలిస్తుండగా మృతి చెందింది.
ఈ ఘటనపై పోలీసులు ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు. కేసు దర్యాప్తు కొనసాగుతోంది.
