ఆలయాన్ని సందర్శించిన డిఎస్పి.
ఉమ్మడి ప్రకాశం జిల్లా క్రైమ్ 9 మీడియా ప్రతినిధి దాసరి యోబు.
భధ్రత్ర ఏర్పాట్లు పరిశీలన..స్వామివారికి ప్రత్యేక పూజలు.రధొత్సవ ఏర్పాట్లపై ఆరా.మార్కాపురంజిల్లా పొదిలి నిర్మమహేశ్వరస్వామి వారిని కనిగిరి డిఎస్పి సాయిఈశ్వర్ యశ్వంత్ సందర్శించారు.
మహశివరాత్రి సందర్భంగా భద్రత ఏర్పాట్లను ఆయన పరిశీలించారు.
రధొత్సవం సందర్బంగా పెద్ద ఎత్తున భక్తులు వచ్చే ఆవకాశం ఉన్నందున రద్దిని తట్టుకునేందుకు ఆలయ సిబ్బందికి ప్రత్యేక సూచనలు ఇచ్చారు.
శాంతిభద్రతలకు ప్రత్యేక టింలు నిరంతరం పర్యవేక్షించే విధంగా చూడాలని ఆయన కొరారు.
ఈ సందర్బంగా ఆలయంలో స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఆలయ కమీటి ఆధ్వర్యంలో డిఎస్పి కి ఘనంగా స్వాగతం పలికారు.
ఈ కార్యక్రమంలో పొదిలి సర్కిల్ ఇన్స్పెక్టర్ రాజేష్ కుమార్, సబ్ ఇన్స్పెక్టర్ ఎస్.రాజేష్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
