పలు దొంగతనాలకు పాల్పడ్డ వ్యక్తి అరెస్టు దొంగిలించిన సొత్తును స్వాధీనం చేసుకున్న పోలీసులు.
ఉమ్మడి ప్రకాశం జిల్లా క్రైమ్ 9 మీడియా ప్రతినిధి దాసరియోబు.
మార్కాపురం జిల్లా కంభం పోలీస్ స్టేషన్ ఆవరణలో పత్రిక సమావేశంలో మార్కాపురం డిఎస్పి యు నాగరాజు మాట్లాడుతూ. చెడు వ్యసనాలకు బానిసై దేవాలయాలు మరియు ఇళ్ళలో దొంగతనాలు చేసిన వ్యక్తుని అరెస్ట్ చేసి, చోరి సొత్తు ను రికవరీ చేసిన మార్కాపురం జిల్లా పోలీస్ లు మద్యం మరియు చెడు వ్యసనాలకు అలవాటు పడి, దొంగతనాలు చేస్తున్న నేరస్తుడు
అర్ధవీడు మండలం, మాగుటూరు గ్రామంలో గల శ్రీ వెంకటేశ్వర స్వామి గుడి మరియు కంభం మండలం రావిపాడులో గల శ్రీ భీమేశ్వరాలయంలో దొంగతనాలు చేసి హుండీలోని నగదు, అమ్మవారి బంగారు ఆభరణాలు దొంగిలించిన నేరస్తుడు.
కంభం మండలంలోని, కంభం షిరిడి సాయి నగర్ మరియు నడింపల్లి గ్రామంలో తాళం వేసి ఉన్న ఇళ్ళలో దొంగతనాలు చేసి బంగారు నగలు మరియు కంభం ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో గల దుర్గా వైన్ షాప్ తాళం పగుల గొట్టి నగదు దొంగిలించిన నేరస్తుడు.
పై కేసు లలో 5 లక్షల విలువ కలిగిన 40 గ్రాముల బంగారు నగలు, 25 తులాల వెండి పట్టీలు, 20,000 నగదు ను రికవరీ చేయడం జరిగింది.
ఇటీవల కంభం మరియు అర్ధవీడు మండలాల లోని దేవాలయాలు మరియు ఇళ్ళలో జరుగుతున్న దొంగతనాలపై మార్కాపురం జిల్లా ఎస్పీ వి. హర్షవర్ధన్ రాజు ఐపీఎస్ సూచనల మేరకు మార్కాపురం డిఎస్పీ యు.నాగరాజు ఆధ్వర్యంలో కంభం సర్కిల్ ఇన్స్పెక్టర్.కె.మల్లికార్జున, కంభం ఎస్సై ఏ.శివ కృష్ణా రెడ్డి మరియు వారి సిబ్బంది ప్రత్యేక బృందాలుగా ఏర్పడి కేసులను ఛేదించి, తే:04-05-2026 న పై నేరాలకు పాల్పడుతున్న ముద్దాయిని ఉదయం 10.00 గంటలకు కంభం గ్రామం మరియు మండలంలోని చెరువు కట్టకు వెళ్ళు దారిలో గల అంకాలమ్మ గుడి సమీపంలో అరెస్ట్ చేసి, కేసులకు సంబంధించిన చోరి సొత్తును రికవరీ చేయడం జరిగింది.
ముద్దాయి పేరు భూపని సాయి, తండ్రి రమణయ్య, వయస్సు 23 సంవత్సరాలు, జగ్గంబొట్ల కృష్ణాపురం గ్రామము, బేస్తవారిపేట మండలం.
కేసుల వివరాలు
1. Cr. No. 17/2026 U/sec 331(4), 305(a) BNS of అర్ధవీడు PS
2. Cr.No. 47 /2026 U/sec 331(4), 305(a) BNS of కంబం PS
3. Cr.No. 39 /2026 U/sec 331(4), 305(a) BNS of కంబం PS
4. Cr.No. 195 /2025 U/sec 331(4), 305(a) BNS of కంబం PS
5. Cr. No. 133 /2025 U/sec 331(4), 305(a) BNS of కంబం PS
నేరాలు జరిగిన విధానం
ముద్దాయి భూపని సాయి, కంభం రంగారాజ్ స్కూల్ నందు 8 వ తరగతి వరకు చదువుకొని తర్వాత చదువు మానుకొని, కూలి పనులకు వెళ్తూ చెడు వ్యసనాలకు బానిసై, కూలి పనులు చేసుకోవడం వల్ల వచ్చే డబ్బులు తన వ్యసనాలకు సరిపోకపోవడంతో దొంగతనాలు చేయడం ప్రారంభించాడు. ఈ క్రమంలో గతంలో 2021 డిసెంబర్ నెలలో బేస్తవారిపేట మండలంలో దొంగతనాలు చేయడంతో పోలీస్ లు అరెస్ట్ చేసి జైలుకు పంపడం జరిగింది. ఆ కేసులలో ఇతని పై సస్పెక్ట్ షీట్ ను కూడా ఓపెన్ చేయడం జరిగింది. తరువాత అతను జైలు నుండి విడుదల అయిన తరువాత తిరిగి తన నేర ప్రవృత్తి ని మార్చుకోకుండా తిరిగి అతని వ్యసనాలను తీర్చుకోవడానికి మరల దొంగతనాలు చేయడం ప్రారంభించాడు. ఈ క్రమం లో ముద్దాయి తేదీ 24.08.2025 న అర్ధరాత్రి సుమారు 11:30 గంటల సమయంలో కంభం పట్టణంలోని షిరిడి సాయి నగర్ లో ఇంటికి తాళం పగలగొట్టి ఇంట్లోకి వెళ్లి ఇంట్లో ఉన్న బీరువా తాళం పగలగొట్టి బంగారు నగలు మరియు నగదు ను, తేదీ 28.11.2025 న అర్ధరాత్రి దాటిన తరువాత కంభం పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో గల దుర్గా వైన్ షాప్ వెనుక వైపు గోడకు గల కిటికీని పగలగొట్టి అందులో నుండి వైన్ షాపులోకి వెళ్లి వైన్ షాప్ కాష్ కౌంటర్ లో ఉన్న నగదు ను, తేదీ 04.04.2026 న రాత్రి సమయంలో కంభం మండలంలోని నడింపల్లి గ్రామ చివర్లో గల ఒక ఇంటి తాళం పగలగొట్టి బీరువాలో ఉన్న బంగారు కమ్మలు, మరియు వెండి పట్టీలును, తేదీ 17/18.04.2026 న రాత్రి సమయంలో రావిపాడు గ్రామంలో గల శ్రీ భీమేశ్వర స్వామి గుడి తలుపులు పగలగొట్టి అందులోని భువనేశ్వరి అమ్మవారి గుడిలో ఉన్న బంగారు తాళిబొట్టు, ఒక చిన్న ఉంగరము, వెండి పట్టీలు, తేదీ 18.04.2026 న రాత్రి సమయంలో అర్ధవీడు మండలంలోని మాగుటూరు గ్రామంలో గల శ్రీ వెంకటేశ్వర స్వామి గుడి తలుపులు పగలగొట్టి అందులోని హుండీ ని పగలగొట్టి అందులో ఉన్న షుమారు రూ. 10,000/- దొంగతనం చేశారు.
సొత్తు వివరాలు
1. పై అన్ని కేసులలో నేరస్తుడు దొంగిలించిన 2,50,000/- విలువ కలిగిన 20 గ్రాముల బరువు కలిగిన బంగారు నగలు మరియు 25 తులాల బరువు కలిగిన వెండి పట్టీలు మరియు 20,000 రూపాయల నగదును నేరస్తుడి నుండి స్వాధీనం చేసుకోవడం జరిగింది.
అదేవిధంగా గతంలో కంభం గణేష్ నగర్ లో జరిగిన క్రైమ్ నెంబర్ 167/2024, U/sec 331(4), 305(a) BNS of Cumbum PS దొంగతనం చేసిన ముద్దాయి చిన సైదా రావు అనే నేరస్తుడిని అరెస్ట్ చేసి, ఆ ఇంట్లో దొంగిలించిన 20 గ్రాముల నగలను రికవరీ చేయడం జరిగింది.
పై కేసులను త్వరగా ఛేదించడం లో మరియు ముద్దాయిని చాకచక్యం గా అరెస్ట్ చేయడం లో, దొంగిలించిన పై సొత్తు ను రికవరీ చేయడం లో ప్రతిభ చూపిన కంభం సర్కిల్ ఇన్స్పెక్టర్ కె. మల్లికార్జున, కంభం సబ్ ఇన్స్పెక్టర్ ఏ .శివ కృష్ణారెడ్డి మరియు వారి సిబ్బంది కానిస్టేబుల్ లు వెంకటేశ్వర్లు, రంగ స్వామి లను మార్కాపురం జిల్లా ఎస్పీ వి హర్షవర్ధన్ రాజ్ అభినందించారు.

