రాజమండ్రి రైల్వే బ్రిడ్జిపై గుర్తుతెలియని మృతదేహం.



 రాజమండ్రి రైల్వే బ్రిడ్జిపై గుర్తుతెలియని మృతదేహం.

మృతుడి ఆచూకీ తెలిసిన వారు పోలీసులకు సమాచారం ఇవ్వాలని విజ్ఞప్తి.

క్రైమ్ 9 మీడియా తూర్పు గోదావరి జిల్లా ప్రతినిధి.

రాజమండ్రి అక్టోబర్ 06: రాజమండ్రి వద్ద గోదావరి నదిపై ఉన్న రైల్వే ఆర్చ్ బ్రిడ్జిపై గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైన ఘటన కలకలం రేపింది. గవర్నమెంట్ రైల్వే పోలీసుల వివరాల ప్రకారం.. 2026 అక్టోబర్ 4వ తేదీ ఉదయం 10 గంటలకు ముందు రైల్వే బ్రిడ్జిపై ఉన్న పట్టాల వద్ద సుమారు 40 నుంచి 45 సంవత్సరాల వయస్సు కలిగిన గుర్తుతెలియని పురుషుడు మృతి చెంది ఉన్నట్లు గుర్తించారు.

గుర్తుతెలియని రైలు నుంచి జారిపడి ఆయన మృతి చెంది ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. మృతుడి వివరాలు, చిరునామా, బంధువుల ఆచూకీ తెలియరాలేదు. మృతుడిని గుర్తించేందుకు గవర్నమెంట్ రైల్వే పోలీసులు చర్యలు చేపట్టారు.

మృతుడి ఫొటోను పోలీసులు విడుదల చేశారు. ఫొటోలో ఉన్న వ్యక్తి ఎవరైనా తెలిసిన వారు లేదా అతని కుటుంబ సభ్యుల గురించి సమాచారం ఉన్న వారు వెంటనే రాజమండ్రి గవర్నమెంట్ రైల్వే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు.

సమాచారం కోసం:

📞 99086 22211

📞 0883 244 2821

మృతుడి వివరాలు గుర్తించడంలో ప్రజలు సహకరించాలని రైల్వే పోలీసులు విజ్ఞప్తి చేశారు.

Post a Comment

Please Select Embedded Mode To Show The Comment System.*

Previous Post Next Post