77 కుటుంబాలకు సొంతింటి భరోసా.


 77 కుటుంబాలకు సొంతింటి భరోసా.

పీఎంఏవై–అర్బన్ 2.0 కింద గృహ మంజూరు ఉత్తర్వులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే గౌతు శిరీష.

క్రైమ్ 9 మీడియా శ్రీకాకుళం జిల్లా ప్రతినిధి.

పలాస అక్టోబర్ 06: 

పేద, మధ్యతరగతి కుటుంబాల సొంతింటి కలను సాకారం చేయడమే ప్రభుత్వ లక్ష్యమని పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష అన్నారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన–అర్బన్ 2.0 పథకం కింద అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ పరిధిలో ఎంపికైన 77 మంది లబ్ధిదారులకు మంజూరైన గృహాల ఉత్తర్వులను సోమవారం ఆమె అందజేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. సొంత ఇల్లు ప్రతి కుటుంబానికి భద్రత, ఆత్మగౌరవాన్ని కల్పిస్తుందని అన్నారు. అర్హత కలిగిన పేద కుటుంబాలకు ప్రభుత్వ గృహ పథకాల ద్వారా శాశ్వత నివాస వసతి కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న గృహ పథకాలను అర్హులైన ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

గృహ మంజూరు ఉత్తర్వులు అందుకున్న 77 కుటుంబాలు ఇకపై నిర్మాణ ప్రక్రియను వేగవంతం చేసుకునే అవకాశం కలిగిందన్నారు. లబ్ధిదారులకు గృహ నిర్మాణానికి సంబంధించి అవసరమైన మార్గదర్శకాలు, పథకం నిబంధనలు, నిర్మాణ దశలపై అధికారులు పూర్తి అవగాహన కల్పించాలని సూచించారు. మంజూరైన గృహాలను నిర్ణీత సమయంలో నిర్మించుకునేలా లబ్ధిదారులకు శాఖాపరంగా అవసరమైన సహకారం అందించాలని అధికారులను ఆదేశించారు.

పట్టణ ప్రాంతాల్లో సొంత స్థలం ఉన్నప్పటికీ ఇల్లు నిర్మించుకోలేని అర్హులైన కుటుంబాలకు ఇలాంటి పథకాలు ఎంతో ప్రయోజనకరంగా ఉంటాయని పేర్కొన్నారు. ప్రభుత్వం కల్పిస్తున్న అవకాశాలను సద్వినియోగం చేసుకుని నాణ్యతతో ఇళ్ల నిర్మాణాలను పూర్తి చేసుకోవాలని లబ్ధిదారులకు ఎమ్మెల్యే సూచించారు.

గృహ మంజూరు ఉత్తర్వులు అందుకున్న లబ్ధిదారులు సంతోషం వ్యక్తం చేశారు. తమ సొంతింటి కలను నెరవేర్చుకునే అవకాశం కల్పించిన ప్రభుత్వానికి, ఎమ్మెల్యే గౌతు శిరీషకు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో గృహ నిర్మాణ శాఖ అధికారులు, సిబ్బంది, ప్రజాప్రతినిధులు, లబ్ధిదారులు పాల్గొన్నారు.

Post a Comment

Please Select Embedded Mode To Show The Comment System.*

Previous Post Next Post