అటవీ శాఖ ఆధ్వర్యంలో ఘనంగా వన్య ప్రాణుల వారోత్సవాలు. బైక్ ర్యాలి.
ఉమ్మడి ప్రకాశం జిల్లా క్రైమ్ 9 మీడియా ప్రతినిధి దాసరి యోబు.
మార్కాపురం జిల్లా అర్ధవీడు మండలం.పాపినేనిపల్లి ఫారెస్ట్ డివిజన్ పరిధిలోని అటవీ శాఖ అధికారుల ఆధ్వర్యంలో వన్యప్రాణుల వారోత్సవాలను గురువారం అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అర్ధవీడు మండల కేంద్రంలోని ప్రభుత్వ వైద్యశాల ప్రాంగణం నుంచి పాపినేనిపల్లి బస్టాండ్ వరకు దాదాపు 5 కిలోమీటర్ల మేర ద్విచక్ర వాహనాల (బైక్) ర్యాలీ చేపట్టి ప్రజా చైతన్యం కలిగించారు.
ర్యాలీ పొడవునా అధికారులు, సిబ్బంది "పచ్చని చెట్లు – ప్రగతికి మెట్లు", "వన్యప్రాణుల వేట – చట్టరీత్యా నేరం" అంటూ నినాదాలు చేస్తూ పరిసర ప్రాంత ప్రజలకు పర్యావరణ పరిరక్షణ, అడవులు మరియు వన్యప్రాణుల ప్రాముఖ్యతపై అవగాహన కల్పించారు. అడవులను కాపాడుకోవడం, మనుగడ సాగిస్తున్న జీవవైవిధ్యాన్ని రక్షించుకోవడం మనందరి బాధ్యత అని అధికారులు ఉద్ఘాటించారు.
ఈ కార్యక్రమంలో పాపినేనిపల్లి డిఆర్ఓ రామయ్య, తురిమిళ్ళ డిఆర్ఓ శ్రీనివాసులు, అరవీటికోట డిఆర్ఓ నీలిమాదేవిలతో పాటు బొల్లుపల్లి ఎఫ్బిఓ ఇమ్రాన్, అరవీటికోట ఎఫ్బిఓ ఆశ పాల్గొన్నారు. వీరితో పాటు పాపినేనిపల్లి, ఆర్వీటి కోట మరియు వెలగలపాయ పరిధిలోని బేస్ క్యాంప్ వాచర్లు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
