ప్రకాశం జిల్లాలో ఎలక్ట్రిక్ వెహికల్ & డ్రోన్ టెక్నాలజీస్‌ పై సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ప్రారంభం.





 ప్రకాశం జిల్లాలో ఎలక్ట్రిక్ వెహికల్ & డ్రోన్ టెక్నాలజీస్‌ పై సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ప్రారంభం.

ఉమ్మడి ప్రకాశం జిల్లా క్రైమ్ 9 మీడియా ప్రతినిధి దాసరి యోబు.

 ప్రకాశం జిల్లా యువతకు ఆధునిక సాంకేతిక నైపుణ్యాలను అందించి, భవిష్యత్ ఉపాధి అవకాశాలకు వారిని సిద్ధం చేయాలనే లక్ష్యంతో స్కిల్ డెవలప్‌మెంట్ డిపార్ట్‌మెంట్, ఒంగోలు – APSSDC, డిస్ట్రిక్ట్ మినరల్ ఫౌండేషన్ ట్రస్ట్ మరియు సెంటూరియన్ యూనివర్సిటీ సహకారంతో ఏర్పాటు చేసిన ఎలక్ట్రిక్ వెహికల్ (EV) & డ్రోన్ టెక్నాలజీస్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ప్రారంభోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది.

ప్రభుత్వ ITI కళాశాల ప్రాంగణంలోని స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్ (SDC) లో గురువారం నిర్వహించిన ఈ కార్యక్రమంలో గౌరవనీయులు గొట్టిపాటి రవికుమార్, విద్యుత్ శాఖ మంత్రి, ప్రకాశం జిల్లా కలెక్టర్ & మేజిస్ట్రేట్ శ్రీ పి. రాజాబాబు, IAS, ఒంగోలు ఎమ్మెల్యే శ్రీ దామచర్ల జనార్దన్ ముఖ్య అతిథులుగా పాల్గొని సెంటర్‌ను ప్రారంభించారు. సెంటూరియన్ యూనివర్సిటీ ప్రతినిధుల బృందం కార్యక్రమంలో పాల్గొంది.

ఈ సందర్భంగా ముఖ్య అతిథులు సెంటర్‌లో ఏర్పాటు చేసిన ఎలక్ట్రిక్ వెహికల్, డ్రోన్ టెక్నాలజీ శిక్షణా సదుపాయాలు, ప్రాక్టికల్ ట్రైనింగ్ పరికరాలు మరియు డెమోన్స్ట్రేషన్ విభాగాలను పరిశీలించారు.

విద్యార్థులను ఉద్దేశించి ముఖ్య అతిథుల ప్రసంగం.

ఈ సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి శ్రీ గొట్టిపాటి రవికుమార్ మాట్లాడుతూ, దేశంలో ఎలక్ట్రిక్ మొబిలిటీ, గ్రీన్ ఎనర్జీ, ఆధునిక సాంకేతిక రంగాలు వేగంగా అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో యువత అందుకు అనుగుణంగా నూతన నైపుణ్యాలను అభివృద్ధి చేసుకోవాలని సూచించారు. EV రంగంలో సాంకేతిక పరిజ్ఞానాన్ని, ప్రాక్టికల్ నైపుణ్యాలను పెంపొందించుకుంటే భవిష్యత్తులో మంచి అవకాశాలను అందిపుచ్చుకోవచ్చని తెలిపారు.

జిల్లా కలెక్టర్ & మేజిస్ట్రేట్

పి. రాజాబాబు, మాట్లాడుతూ, ప్రకాశం జిల్లాలోని యువతకు పరిశ్రమల అవసరాలకు అనుగుణమైన నైపుణ్య శిక్షణ అందించేందుకు ఇటువంటి ఆధునిక శిక్షణా కేంద్రాలు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని తెలిపారు. విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని టెక్నికల్ స్కిల్స్‌తో పాటు కమ్యూనికేషన్, ప్రాబ్లమ్ సాల్వింగ్ మరియు ప్రాక్టికల్ స్కిల్ ను అభివృద్ధి చేసుకోవాలని సూచించారు.

ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ మాట్లాడుతూ, యువతకు నైపుణ్య శిక్షణ అందించడం ద్వారా వారి ఉపాధి అవకాశాలను మెరుగుపరచవచ్చని తెలిపారు. ఆధునిక సాంకేతిక రంగాల్లో శిక్షణ పొందిన యువత స్వయం ఉపాధి అవకాశాలను కూడా సృష్టించుకునే విధంగా ముందుకు సాగాలని ఆకాంక్షించారు.

సెంచురియన్ యూనివర్సిటీ సహకారం.సెంచురియన్ యూనివర్సిటీ ప్రతినిధులు మాట్లాడుతూ, విద్యార్థులకు కేవలం సైద్ధాంతిక పరిజ్ఞానంతో పాటు హ్యాండ్స్-ఆన్ ప్రాక్టికల్ ట్రైనింగ్, ఇండస్ట్రీ ఎక్స్‌పోజర్ మరియు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంపై శిక్షణ అందించడమే ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యమని తెలిపారు. శిక్షణ అనంతరం అర్హత కలిగిన యువతకు ఉపాధి మరియు ప్లేస్‌మెంట్ అవకాశాలకు అవసరమైన మార్గదర్శకత్వం అందించేందుకు కృషి చేస్తామని తెలిపారు.

ఈ వి మరియు డ్రోన్ టెక్నాలజీలో భవిష్యత్తు అవకాశాలు.  

ఈ సెంటర్ ద్వారా యువతకు ఎలక్ట్రిక్ వెహికల్ టెక్నాలజీ, EV సర్వీసింగ్, ఆధునిక ఆటోమొబైల్ టెక్నాలజీ, డ్రోన్ టెక్నాలజీ, డ్రోన్ ఆపరేషన్స్, ప్రాక్టికల్ ట్రైనింగ్ మరియు పరిశ్రమలతో అనుసంధానం వంటి అంశాల్లో శిక్షణకు అవకాశాలు కల్పించనున్నారు.

యువతను భవిష్యత్ పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా తీర్చిదిద్దడంతో పాటు ఉపాధి, స్వయం ఉపాధి మరియు ప్లేస్‌మెంట్ అవకాశాలకు మార్గం సుగమం చేయడమే సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ప్రధాన ఉద్దేశ్యమని అధికారులు తెలిపారు.

ఈ సందర్భంగా విద్యార్థులు, శిక్షకులు, APSSDC అధికారులు, స్కిల్ డెవలప్‌మెంట్ డిపార్ట్‌మెంట్ సిబ్బంది, ప్రభుత్వ ITI కళాశాల అధికారులు, సెంచురియన్ యూనివర్సిటీ ప్రతినిధులు మరియు సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

నేటి నైపుణ్య శిక్షణే – రేపటి ప్రకాశం యువతకు బలమైన భవిష్యత్తు” అనే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నట్లు అధికారులు తెలిపారు.

Post a Comment

Please Select Embedded Mode To Show The Comment System.*

Previous Post Next Post