కంభం జెడ్పీ హైస్కూల్ స్కూల్ మేనేజ్‌మెంట్ వైస్ చైర్మన్‌గా షేక్ ఖాశింపీరా.
ఏకగ్రీవ ఎన్నికతో అభినందనల వెల్లువ.. నాయక్ వీధిలో ఘన సన్మానం.
కంభం: కంభం వివిఎస్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శనివారం నిర్వహించిన స్కూల్ మేనేజ్‌మెంట్ కమిటీ ఎన్నికల్లో వైస్ చైర్మన్‌గా షేక్ ఖాశింపీరా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా ఆయనను స్నేహితులు, శ్రేయోభిలాషులు ఘనంగా సన్మానించారు.
వైస్ చైర్మన్‌గా ఏకగ్రీవంగా ఎన్నికైన షేక్ ఖాశింపీరాను ఈరోజు కంభంలోని నాయక్ వీధిలో గృహమునందు స్నేహితులు, ఆత్మీయులు శాలువాలు కప్పి, పూలమాలలు వేసి ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తూ, పాఠశాల అభివృద్ధికి మరింత కృషి చేయాలని ఆకాంక్షించారు.
విద్యార్థుల విద్యాభివృద్ధి, పాఠశాలలో మౌలిక వసతుల మెరుగుదల, విద్యార్థులకు మెరుగైన వాతావరణం కల్పించడం వంటి అంశాల్లో స్కూల్ మేనేజ్‌మెంట్ కమిటీ కీలక పాత్ర పోషిస్తుందని స్నేహితులు పేర్కొన్నారు. వైస్ చైర్మన్‌గా ఎన్నికైన షేక్ ఖాశింపీరా తన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తిస్తూ పాఠశాల అభివృద్ధికి తన వంతు సహకారం అందించాలని వారు ఆకాంక్షించారు.
ఈ సన్మాన కార్యక్రమంలో మాజీ వార్డ్ నెంబర్ మహబూబ్ సుభాని, రషీద్ , రంగయ్య, వాక రంగనాయకులు, అబ్దుల్, రసూల్, పాల్గొని షేక్ ఖాశింపీరాకు అభినందనలు, శుభాకాంక్షలు తెలిపారు. ఏకగ్రీవంగా ఎన్నిక కావడం పట్ల పలువురు హర్షం వ్యక్తం చేశారు.

