పౌష్టికాహార నాణ్యతపై ప్రత్యేక దృష్టి ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి.
అంగన్వాడీ కేంద్రాల ద్వారా మెరుగైన సేవలు అందించాలి: ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి.
ఉమ్మడి ప్రకాశం జిల్లా క్రైమ్ 9 మీడియా ప్రతినిధి దాసరి యోబు.
పోషణ్ మాసం 2026 – మన అంగన్వాడీ.. మన బాధ్యత
కార్యక్రమంలో భాగంగా ఆంధ్రప్రదేశ్ మహిళాభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ, ఐసీడీఎస్ ప్రాజెక్ట్ ఆధ్వర్యంలో కొమరోలు పట్టణంలో నిర్వహించిన కార్యక్రమా అతిధి గా గిద్దలూరు నియోజకవర్గ శాసనసభ్యులు ముత్తుముల అశోక్ రెడ్డి గారు హాజరయ్యారు.
ఈ సందర్భంగా అంగన్వాడీ కేంద్రాల ద్వారా చిన్నారులు, గర్భిణీలు, బాలింతలకు అందిస్తున్న పౌష్టికాహారాన్ని ఎమ్మెల్యే గారు స్వయంగా పరిశీలించారు. అంగన్వాడీ కార్యకర్తలు, సిబ్బందిని అడిగి పౌష్టికాహారం పంపిణీ, లబ్ధిదారులకు అందుతున్న సేవల వివరాలను తెలుసుకున్నారు.
అనంతరం శాసనసభ్యులు అశోక్ రెడ్డి గారు మాట్లాడుతూ పౌష్టికాహారం నాణ్యత, పరిశుభ్రత విషయంలో ప్రత్యేక శ్రద్ధ వహించాలని, అర్హులైన ప్రతి లబ్ధిదారునికి ప్రభుత్వ సేవలు సక్రమంగా అందేలా అధికారులు, సిబ్బంది బాధ్యతగా పనిచేయాలని సూచించారు.
చిన్నారులు, గర్భిణీలు, బాలింతల ఆరోగ్యానికి పౌష్టికాహారం ఎంతో ముఖ్యమని పేర్కొన్న ఎమ్మెల్యే గారు, అంగన్వాడీ కేంద్రాల ద్వారా అందుతున్న సేవలను మరింత సమర్థవంతంగా అందించాలని అన్నారు.
అనంతరం మహిళలు, శిశువులతో ఎమ్మెల్యే నేరుగా మాట్లాడి వారికి అందుతున్న పౌష్టికాహారం, అంగన్వాడీ సేవలపై వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు. వారి సమస్యలు, అవసరాలను గుర్తించి పరిష్కారానికి కృషి చేయాలని సిబ్బందికి సూచించారు.
పోషణ్ మాసం కార్యక్రమం ద్వారా చిన్నారులు, మహిళల్లో పౌష్టికాహార ప్రాధాన్యతపై అవగాహన పెంచడంతో పాటు, ఆరోగ్యకరమైన జీవన విధానంపై ప్రజలకు మరింత అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని నిర్వాహకులు తెలిపారు.
ఈ కార్యక్రమంలో అధికారులు, అంగన్వాడీ కార్యకర్తలు, సిబ్బంది, కూటమి నాయకులు, మహిళలు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

