సైకిల్‌పై భారత దేశంలోని 17 శక్తిపీఠాల యాత్ర.
పలాస చేరుకున్న మంచిర్యాల యువకుడు సందేశ్ గుప్తా.
క్రైమ్ 9 మీడియా శ్రీకాకుళం జిల్లా ప్రతినిధి
పలాస అక్టోబర్ 06 : తెలంగాణ రాష్ట్రం మంచిర్యాల ప్రాంతానికి చెందిన సందేశ్ గుప్తా భారత దేశంలోని 17 శక్తిపీఠాల దర్శనమే లక్ష్యంగా సైకిల్‌పై ఆధ్యాత్మిక యాత్ర చేపట్టారు. ఈ యాత్రలో భాగంగా మంగళవారం ఆయన శ్రీకాకుళం జిల్లా పలాసకు చేరుకున్నారు. పలాసలోని ప్రముఖ ఆలయాలను సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారి ఆశీస్సులు పొందారు. ఆయా ఆలయాల విశిష్టత, ఆధ్యాత్మిక ప్రాధాన్యతను తెలుసుకున్నారు.
మంచిర్యాల నుంచి సైకిల్‌పై సుదూర ప్రాంతాలను దాటుకుంటూ తన యాత్రను కొనసాగిస్తున్న సందేశ్ గుప్తా.. మార్గమధ్యంలో పలు ప్రముఖ పుణ్యక్షేత్రాలను సందర్శిస్తున్నట్లు తెలిపారు. శ్రీకాకుళం జిల్లాలోని అరసవల్లి సూర్యనారాయణ స్వామి ఆలయం, శ్రీకూర్మం కూర్మనాథస్వామి ఆలయాలను దర్శించడం ఎంతో ఆనందంగా ఉందన్నారు.
ఆధ్యాత్మిక సంకల్పంతో సైకిల్‌పై శక్తిపీఠాల యాత్ర సాగిస్తున్న సందేశ్ గుప్తాను విశ్వహిందూ పరిషత్ ప్రతినిధులు ఘనంగా స్వాగతించారు. ధాత్త ఆశ్రమం స్వామీజీ ఆధ్వర్యంలో ఆయనకు ఆశ్రయం కల్పించి అభినందించారు. సైకిల్‌పై సుదీర్ఘ ఆధ్యాత్మిక యాత్ర చేపట్టి పుణ్యక్షేత్రాలను సందర్శిస్తున్న సందేశ్ గుప్తాను పలువురు అభినందించారు.
