పోగొట్టుకున్న మొబైల్ ఫోన్లను ట్రేస్ చేసి యజమానులకు అప్పగించిన కంభం ఎస్సై.
ఉమ్మడి ప్రకాశం జిల్లా క్రైమ్ 9 మీడియా ప్రతినిధి దాసరి యోబు.
4 మొబైల్ ఫోన్లు ట్రేస్ 2 ఫోన్లు సంబంధిత యజమానులకు అప్పగింత
మార్కాపురం జిల్లా కంభం పోలీస్ స్టేషన్ పరిధిలో మిస్సింగ్ అయిన 4 మొబైల్ ఫోన్లను పోలీసులు సాంకేతిక పరిజ్ఞానం సహాయంతో ట్రేస్ చేసి గుర్తించారు.
వాటిలో 2 మొబైల్ ఫోన్లను సరైన ధృవీకరణ అనంతరం సంబంధిత యజమానులకు అప్పగించారు. మిగిలిన మొబైల్ ఫోన్లను కూడా సంబంధిత వ్యక్తులకు అందజేసేందుకు తదుపరి చర్యలు కొనసాగుతున్నాయి తెలిపారు.
పోగొట్టుకున్న మొబైల్ ఫోన్లను గుర్తించి తిరిగి అందజేయడంలో కృషి చేసిన కంభం పోలీసులను బాధితులు కృతజ్ఞతలు తెలియజేశారు .
సాంకేతిక పరిజ్ఞానంతో సమర్థవంతమైన పోలీసింగ్ ప్రజలకు మెరుగైన సేవలే లక్ష్యం అని కంభం సబ్ ఇన్స్పెక్టర్ శివకృష్ణారెడ్డి అన్నారు.
