మార్కాపురంలో రాష్ట్రస్థాయి బాల్ బ్యాడ్మింటన్ పోటీల బ్రోచర్‌ను ఆవిష్కరించిన జిల్లా కలెక్టర్.


 మార్కాపురంలో రాష్ట్రస్థాయి బాల్ బ్యాడ్మింటన్ పోటీల బ్రోచర్‌ను ఆవిష్కరించిన జిల్లా కలెక్టర్.

ఉమ్మడి ప్రకాశం జిల్లా క్రైమ్ 9 మీడియా ప్రతినిధి దాసరి యోబు.

 మార్కాపురం జిల్లా మార్కాపురం: పట్టణంలోని జడ్పీ బాలుర ఉన్నత పాఠశాలలో ఈ నెల 11, 12, 13 తేదీల్లో నిర్వహించనున్న రాష్ట్రస్థాయి సబ్‌ జూనియర్ బాల్ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్‌కు పోటీలకు సంబంధించిన బ్రోచర్‌ను జిల్లా కలెక్టర్ ఎం. విజయ సునీత మంగళవారం స్థానిక కలెక్టరేట్‌లో ఆవిష్కరించారు. 

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ విద్యార్థులకు విద్యతో పాటు క్రీడలు కూడా ఎంతో అవసరమన్నారు. క్రీడలు విద్యార్థుల్లో క్రమశిక్షణ, పట్టుదల, ఏకాగ్రత, సమష్టి భావనను పెంపొందిస్తాయని తెలిపారు.

రాష్ట్రస్థాయి పోటీలను మార్కాపురంలో నిర్వహించడం స్థానికంగా క్రీడా వాతావరణాన్ని మరింత బలోపేతం చేస్తుందన్నారు.

ముఖ్యంగా పోటీలకు హాజరయ్యే క్రీడాకారులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా నిర్వాహకులు సమన్వయంతో అవసరమైన ఏర్పాట్లు చేపట్టాలని సూచించారు.

క్రీడాకారులకు వసతి, భోజనం, తాగునీరు, వైద్య సదుపాయాలు తదితర అంశాలపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని సంబంధితులకు సూచించారు..పోటీలు ప్రశాంత వాతావరణంలో, క్రీడా నియమ నిబంధనలకు అనుగుణంగా జరిగేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు.

ఈ కార్యక్రమంలో పాఠశాల పీడీలు తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

Please Select Embedded Mode To Show The Comment System.*

Previous Post Next Post