పొదిలి సర్కిల్ పరిధిలోని ప్రజలు వినాయక చవితి పండుగను ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలి సీ ఐ.
ఉమ్మడి ప్రకాశం జిల్లా క్రైమ్ 9 మీడియా ప్రతినిధి దాసరి యోబు.
మార్కాపురం జిల్లా పొదిలి వినాయక మండపాలను ఏర్పాటు చేసే ప్రతి కమిటీ వారు స్థానిక పోలీస్ స్టేషన్ నుండి ముందుగా అనుమతి తీసుకోవాలి.
మండపాల వద్ద అసాఘిక శక్తులు ప్రవేశించకుండా నిర్వాహకులు ఎప్పుడూ ఇద్దరు లేదా ముగ్గురు వాలంటీర్లను కాపలాగా ఉంచుకోవాలి.
షార్ట్ సర్క్యూట్ ప్రమాదాలు జరగకుండా అర్హత కలిగిన ఎలక్ట్రీషియన్ల ద్వారానే కరెంటు వైరింగ్ చేయించుకోవాలనీ తెలిపారు.
జన సంచారానికి, వాహనాల రాకపోకలకు ఎలాంటి ఇబ్బంది కలగని విధంగా రద్దీ లేని ప్రాంతాలలో మండపాలను ఏర్పాటుచేసుకోవాలి
రాత్రి వేళల్లో శబ్ద కాలుష్యం జరగకుండా డీజేలు, లౌడ్ స్పీకర్ల వాల్యూమ్ పరిమితిలో ఉంచాలి.
అర్ధరాత్రి వరకు శబ్దాలు చేయడానికి అనుమతి లేదు
మండపాల వద్ద టపాసులు కాల్చడం పూర్తిగా నిషేధించబడింది. అలాగే పూజా సామాగ్రి, అగరవత్తులు పెట్టేటప్పుడు నిప్పు రవ్వలు మండపానికి తగలకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.
వినాయక మండపాల వద్ద మరియు నిమజ్జన ఊరేగింపులలో మద్యం సేవించి గొడవలు సృష్టించడం వంటి చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడితే నిర్వాహకులపై కఠిన చర్యలు ఉంటాయన్నారు.
విగ్రహాల నిమజ్జనాన్ని పోలీసు శాఖ సూచించిన మార్గదర్శకాల ప్రకారం, ఎవరికీ ఎలాంటి ఇబ్బంది కలగకుండా ప్రశాంత వాతావరణంలో పూర్తి చేయాలన్నారు.రద్దీ ప్రాంతాల్లో మహిళలు, యువతుల పట్ల అసభ్యంగా ప్రవర్తించే వారిపై నిఘా ఉంచాలి..ఎలాంటి అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలి.ఏ చిన్న సమస్య తలెత్తినా, అత్యవసర పరిస్థితి ఏర్పడినా వెంటనే స్థానిక పోలీసులను సంప్రదించాలనీ పొదిలి సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎం రాజేష్ కుమార్ ప్రజలకు తెలియజేశారు.
