కనిగిరి సబ్ డివిజన్ పోలీస్ స్టేషన్ల పనితీరుపై సమీక్ష సమావేశం నిర్వహించిన మార్కాపురం జిల్లా ఎస్పీ.


 

కనిగిరి సబ్ డివిజన్ పోలీస్ స్టేషన్ల పనితీరుపై సమీక్ష సమావేశం నిర్వహించిన మార్కాపురం జిల్లా ఎస్పీ.

ఉమ్మడి ప్రకాశం జిల్లా క్రైమ్ 9మీడియా ప్రతినిధి దాసరి యోబు.

పెండింగ్ కేసులపై ప్రత్యేక దృష్టి సారించి త్వరితగతిన పరిష్కరించాలి: జిల్లా ఎస్పీ.

రోడ్డు ప్రమాదాల సంఖ్యను తగ్గించేందుకు మరింత ప్రత్యేక చర్యలు తీసుకోవాలి.

రానున్న స్థానిక ఎన్నికలకు ముందస్తు ప్రణాళికతో సిద్ధంగా ఉండాలి- క్షేత్రస్థాయిలో పటిష్ట సమాచార వ్యవస్థ ఏర్పాటు చేయాలి

ఎన్ఫోర్స్మెంట్‌ను పెంచి చట్టవ్యతిరేక మరియు అసాంఘిక కార్యకలాపాలను కట్టడి చేయాలి.

పెండింగ్ లో ఉన్న కేసులు దర్యాఫ్తు వేగవంతం చేయాలని పోలీసు అధికారులను జిల్లా ఎస్పీ గారు ఆదేశించారు. కనిగిరి సబ్ డివిజన్ పరిధిలోని పోలీస్ స్టేషన్ల పనితీరుపై, శాంతిభద్రతల పరిరక్షణ, నేరాల నియంత్రణ, రోడ్డు ప్రమాదాలు,రానున్న స్థానిక ఎలక్షన్ లు మరియు తదితర అంశాలపై జిల్లా ఎస్పీ గారు సోమవారం పామూరు సర్కిల్ కార్యాలయంలో డిఎస్పీ, సీఐలు, ఎస్సైలతో సమావేశం నిర్వహించారు.

ఈ సమీక్షా సమావేశంలో ఎస్పీ గారు పోలీస్ స్టేషన్ల వారీగా పెండింగ్ కేసుల వివరాలు, అరెస్టు, కేసు దర్యాప్తు తీరుతెన్నులపై సంబంధిత పోలీస్ అధికారులతో ఆరా తీసి, కేసుల ఛేదింపునకు మరియు పరిష్కారానికి, నేర నియంత్రణకు దోహదం చేసే పలు సూచనలు మరియు మెళకువలను అధికారులకు దిశా నిర్దేశాలు చేశారు. పోలీస్ స్టేషన్ల వారీగా యూఐ కేసులు తగ్గించుకోవాలని, వీలైనంత త్వరగా పెండింగ్ కేసులను పరిష్కార దశకు తీసుకురావాలని, అరెస్టులు, చార్జ్ షీట్లు, నాన్ బెయిలబుల్ వారెంట్లు పెండింగ్ లో ఉంచకుండా సత్వర పరిష్కారానికి చర్యలు తీసుకోవాలన్నారు. 

రానున్న స్ధానిక సంస్ధల ఎన్నికలను శాంతియుతంగా జరిపించేలా ప్రణాళికా బద్దంగా అన్ని ముందస్తు చర్యలు చేపట్టాలన్నారు. గ్రామపంచాయతీ మున్సిపాలిటీ ఎంపీటీసీ, జడ్పిటిసి ఎన్నికలకు సంబంధించి సమస్యాత్మక/అతి సమస్యాత్మక ప్రాంతాల సమాచారం, అక్కడ తీసుకోవాల్సిన ముందస్తు చర్యలు, క్షేత్రస్థాయిలో పరిశీలించి సమాచారం తీసుకోవాలన్నారు.

ప్రాపర్టీ నేరాల్లో నిందితులను త్వరగా పట్టుకోని ప్రాపర్టీ రికవరీ శాతాన్ని పెంచాలని, చట్టవ్యతిరేక/అసాంఘిక కార్యకలాపాలపై నిఘా ఉంచి కట్టడి చెయ్యాలన్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ప్రాపర్టీ నేరాలకు సంబంధించి 200 ముద్దాయిలను అరెస్ట్ చేసి, ప్రాపర్టీ రికవరీ చేయటం జరిగింది. పాత నేరస్తులపై నిఘా ఉంచాలని, వారిని బైండ్ ఓవర్ చేయాలనీ, బైండవర్ ఉల్లఘించిన వారిపై తగ్గు చర్యలు తీసుకోవాలన్నారు. రోడ్డు ప్రమాదాల నివారణకు డ్రంక్ &డ్రైవ్ తనిఖీలు ముమ్మరం చేయాలన్నారు.

రోడ్డు ప్రమాదాల నివారణలో భాగంగా ప్రకాశం, మార్కాపురం రెండు జిల్లాల వ్యాప్తంగా బ్లాక్ స్పాట్లు మరియు ప్రమాదంలో జరగడానికి అవకాశం ఉన్న ప్రదేశాలలో కుంభాకార దర్పణాలు (Convex Mirrors), జాతీయ, రాష్ట్ర రహదారుల జంక్షన్ వద్ద ఉండే ప్రదేశంలో ముందు జంక్షన్ ఉన్నది.. నిదానంగా వెళ్ళవలేనని పెయింట్ తో పెద్ద అక్షరాలతో వ్రాయించడం జరిగిందని, వాహనదారులు గమనించి ప్రయాణించాలని సూచించారు. ప్రజలు మరియు వాహనదారులు ట్రాఫిక్ నియమాలను పాటిస్తూ, బాధ్యతాయుతంగా వ్యవహరించి పోలీసులకు సహకరించాలని జిల్లా ఎస్పీ గారు విజ్ఞప్తి చేశారు.

ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో ఎన్ఫోర్స్‌మెంట్ కార్యకలాపాలను మరింత సమర్థవంతంగా నిర్వహించాలని ఆదేశించారు. పేకాట, కోడి పందాలు, బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించడం, ప్రజా ప్రశాంతతకు భంగం కలిగించే అసాంఘిక కార్యకలాపాలపై ప్రత్యేక దృష్టి సారించి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు..

Post a Comment

Please Select Embedded Mode To Show The Comment System.*

Previous Post Next Post