పీజీఆర్ఎస్ అర్జీల పరిష్కారంలో నిర్లక్ష్యం వీడండి: కలెక్టర్ విజయ సునీత.
ఉమ్మడి ప్రకాశం జిల్లా క్రైమ్ 9మీడియా ప్రతినిధి దాసరి యోబు.
పీజీఆర్ఎస్ అర్జీలను అధికారులు వేగంగా, క్షేత్రస్థాయి పరిశీలనతో పరిష్కరించాలని కలెక్టర్ ఎం. విజయ సునీత ఆదేశించారు. మార్కాపురం కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన కార్యక్రమంలో 257 అర్జీలు (రెవెన్యూ-182, ఇతర-75) స్వీకరించారు. ప్రజలు పదేపదే కార్యాలయాల చుట్టూ తిరగకుండా, రీ-ఓపెన్ కాకుండా అర్జీదారుల సంతృప్తి మేరకు నాణ్యమైన న్యాయం చేయాలని స్పష్టం చేశారు. కార్యక్రమంలో జేసీ పులి శ్రీనివాసులు, డీఆర్వో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు..
