జాతీయ నులిపురుగు నివారణ దినోత్సవం సందర్భంగా విద్యార్థులకు ఉచితంగా ఆల్బెండజోల్ మాత్రలు పంపిణి.





 జాతీయ నులిపురుగు నివారణ దినోత్సవం సందర్భంగా విద్యార్థులకు ఉచితంగా ఆల్బెండజోల్ మాత్రలు పంపిణి. 

ఉమ్మడి ప్రకాశం జిల్లా క్రైమ్ 9మీడియా ప్రతినిధి దాసరి యోబు.

ఒంగోలు: జాతీయ నులిపురుగు నివారణ దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రకాశం జిల్లాలోని పాఠశాలలు, అంగన్‌వాడీ కేంద్రాల్లో విద్యార్థులకు ఉచితంగా ఆల్బెండజోల్ నులిపురుగు నివారణ మాత్రలను అందజేశారు. ఒంగోలు మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని పి.వి.ఆర్. బాలుర ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన కార్యక్రమానికి జిల్లా కలెక్టర్, జిల్లా మేజిస్ట్రేట్ శ్రీ పి. రాజాబాబు ముఖ్య అతిథిగా పాల్గొని విద్యార్థులకు నులిపురుగు నివారణ మాత్రలను మింగించారు.

ఈ సందర్భంగా జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి డాక్టర్ టి. వెంకటేశ్వర్లు మాట్లాడుతూ, జిల్లాలో సుమారు 3,35,000 మంది పాఠశాల మరియు అంగన్‌వాడీ విద్యార్థులకు ఉచితంగా ఆల్బెండజోల్ మాత్రలను అందిస్తున్నట్లు తెలిపారు. దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం ద్వారా పిల్లల్లో నులిపురుగుల సమస్యను నియంత్రించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.

జిల్లా కలెక్టర్ శ్రీ పి. రాజాబాబు మాట్లాడుతూ, ఒక చిన్న కార్యక్రమం ద్వారా పిల్లల ఆరోగ్యానికి ఎంతో పెద్ద ప్రయోజనం చేకూరుతుందని అన్నారు. పిల్లల ఆరోగ్య పరిరక్షణలో తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, వైద్య ఆరోగ్యశాఖ సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని సూచించారు.

రాష్ట్ర కార్యక్రమ పరిశీలకులు శ్రీ జి. రవీంద్ర కుమార్ కార్యక్రమాన్ని పరిశీలించి, నిర్వహణ పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. పిల్లల ఆరోగ్యం, ఆనందమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు.

నులిపురుగు నివారణ మాత్రల ప్రాధాన్యత

నులిపురుగులు పిల్లల్లో పోషకాహార లోపం, బలహీనత, కడుపునొప్పి, ఆకలి తగ్గడం వంటి సమస్యలకు కారణమయ్యే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ప్రభుత్వం ఉచితంగా అందిస్తున్న ఆల్బెండజోల్ మాత్రలను సూచించిన విధంగా తీసుకోవడం ద్వారా నులిపురుగుల సమస్యను నియంత్రించడంలో సహాయపడుతుందని పేర్కొన్నారు. పిల్లలు చేతులు పరిశుభ్రంగా కడుక్కోవడం, శుభ్రమైన నీటిని తాగడం, ఆహారాన్ని పరిశుభ్రంగా తీసుకోవడం, వ్యక్తిగత పరిశుభ్రత పాటించడం వంటి అలవాట్లను పెంపొందించుకోవాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో ICDS ప్రాజెక్ట్ డైరెక్టర్ శ్రీమతి పద్మ సునంద, DIO డాక్టర్ పి. కమలశ్రీ, MEO ఒంగోలు శ్రీ కిషోర్, శ్రీమతి ఎం. రాధిక, జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి డాక్టర్ టి. వెంకటేశ్వర్లు, రాష్ట్రీయ బాల ఆరోగ్య కార్యక్రమం జిల్లా అధికారి డాక్టర్ భాగీరథి, జిల్లా విద్యాశాఖ అధికారి శ్రీమతి రేణుక, జిల్లా మాస్ మీడియా అధికారి బి. నరసింహారావు, డిప్యూటీ మాస్ మీడియా అధికారి కె.ఎ. రాజు, డిప్యూటీ డీఎంహెచ్‌ఓ డాక్టర్ రమేష్, ఆరోగ్య విద్యా బోధకులు, పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

Post a Comment

Please Select Embedded Mode To Show The Comment System.*

Previous Post Next Post